Breaking News

సమంతకు అలాంటి ఆశలు లేవా? అందుకే లైట్ తీసుకుంటోందా..? రియల్లీ గ్రేట్!!


స్టార్ హీరోయిన్స్ అందరిలో రూటే సపరేటు అని చెప్పడంలో వింతేమీ లేదు. ఎందుకంటే ఎందరో హీరోయిన్స్ పెళ్ళికి ముందు వెండితెరపై సత్తా చాటినప్పటికీ, పెళ్లి తర్వాత అన్నీ క్లోజ్ చేసుకొని ఇంటికే పరిమితమయ్యారు. కానీ.. సమంత మాత్రం పెళ్లి తర్వాత హవా మరింత పెంచేసింది. అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని అమాంతం పెంచేసుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ చూసి బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ఛాన్సులు ఇస్తున్నారట. అయితే సమంత మాత్రం ససేమిరా చేయనంటోందని తెలుస్తోంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే బాలీవుడ్ అవకాశం వచ్చిందంటేచాలు.. చెంగుమని ఎగిరి గంతేస్తుంది. వెంటనే బీ టౌన్ వెళ్లి అక్కడ హంగామా చేయాలని ప్లాన్స్ చేస్తుంది. కానీ అందులో కూడా భిన్నంగానే వ్యవహరిస్తోంది సమంత. బాలీవుడ్ ఆకర్షణకు ఎంతమాత్రం లొంగిపోవడం లేదు. సమంత లీడ్ రోల్ పోషించిన ‘యూటర్న్’ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా కూడా హిందీ ఫిల్మ్ మేకర్స్‌ని బాగా ఆకర్షించిందట. మొదట కన్నడలో విడుదలైన ‘యూటర్న్’ తెలుగులో రీమేక్ అయింది. ఈ చిత్రంలో సమంత నటన చూసి ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు ఈ మూవీని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ మేరకు హిందీ వెర్షన్‌లో కూడా నటించమని సమంతకు ఆఫర్ చేశారట. ఇందుకు సమంత నుంచి 'నో' అనే సమాధానం వెళ్లిందని ఫిలిం నగర్ టాక్. అంతేకాదు తనకు సౌత్ సినిమాల్లోనే కంఫర్ట్‌గా ఉందని, ఇక్కడున్న ఈ పాపులారిటీకి కాపాడుకుంటూ బాగా అలరిస్తే చాలని సమంత అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సమంతకు బాలీవుడ్ పట్ల ఎలాంటి ఆశలు లేవని తెలుస్తోంది. ఏది ఏమైనా సౌత్ ఇండియన్ హీరోయిన్లంతా బాలీవుడ్ ఆఫర్ వస్తే చాలని ఆశగా ఎదురుచూస్తుంటే.. సమంత మాత్రం లైట్ తీసుకోవడం నిజంగా ఆమెలోని గ్రేట్‌నెస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు వెబ్ సిరీస్, నిర్మాణ రంగం వైపు సామ్ అడుగులు పడుతుండటం విశేషం. Also Read:


By May 09, 2020 at 11:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-akkineni-rejected-bollywood-offer/articleshow/75641212.cms

No comments