యాంకర్ వర్షిణి షాకింగ్ స్టేట్‌మెంట్.. ‘సుధీర్ నా బ్రదర్.. అతనికి రష్మినే కరెక్ట్ జోడీ’
సోషల్ మీడియా ప్రభావంతో.. సినిమా వాళ్లతో పాటు టీవీ సెలబ్రిటీలకు అంతే క్రేజ్ వస్తోంది. ఇంతకు ముందు టీవీ యాంకర్లు అంటే ఆ వారానికి వచ్చామా? షో చేసుకున్నామా? అలరించామా? వెళ్లామా అన్నట్టుగానే ఉండేవాళ్లు. అయితే ఇప్పుడు వారి షోలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తూ.. ప్రేక్షకులకు టచ్‌లో ఉంటున్నారు. అయితే తమ పాపులారిటీని పెంచుకునేందుకు తమ అంద చందాలను పదును పొడుతూ హాట్ హాట్ ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ని పెంచుకుంటున్నారు. యాంకర్ అనసూయ ఆరబోత ధోరణి ఆమెకు బాగా కలిసి రావడంతో మిగిలిన యాంకర్లు , , విష్ణు ప్రియ, శ్రీముఖి అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. విరివిగా అందాలను ఆరబోస్తే షోలు వాటంతట అవే వస్తాయిలే అన్నట్టుగా బుల్లితెరపై కూడా అందాల కనువిందు చేస్తున్నారు. ఇక వీళ్ల డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, వల్గారిటీ గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువే. ఇక పోతే.. బుల్లితెరపై ఢీ, జబర్దస్త్, పోవే పోరా, పటాస్ లాంటి కామెడీ షోలలో ఈ ముద్దుగుమ్మలు చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు. ఇక మేల్ యాంకర్స్‌లలో సుడిగాలి సుధీర్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అతను అద్భుతంగా హోస్ట్ చేస్తాడు.. కామెడీ పీక్స్‌లో ఉంటుంది లాంటి విషయాలు పక్కన పెడితే.. మనోడు ఏ షోలో ఉన్న అందులోని యాంకర్‌తో రొమాన్స్ చేస్తుండటంతో రకరకాల రూమర్స్ పుట్టుకొస్తుంటాయి. ఇవన్నీ రేటింగ్స్ కోసం వాడే ట్రిక్స్ అయినప్పటికీ.. బుల్లి తెరపై యాంకర్స్‌తో రొమాన్స్ పండించాలంటే సుధీర్ తరువాతే ఎవరైనా అన్నట్టుగా పరిస్థితి మారింది. రష్మి-సుధీర్‌ల ఎఫైర్ వచ్చినన్ని వార్తలు మరే టీవీ సెలబ్రిటీలపై లేవు. ఇక మనోడు విష్ణు ప్రియ, వర్షిణిలతో సైతం రొమాన్స్ కానిచ్చేస్తూ సీన్‌లను, పాటలను బాగా రక్తికట్టిస్తుంటాడు. ఇక ఎప్పుడు సుధీర్-రష్మిల ఎఫైర్‌ల గురించే ఏం మాట్లాడుకుంటాం.. వర్షిణితో అయితే రూమర్ కాస్త ప్రెష్‌గా అనిపిస్తుందేమో అనుకున్నారో ఏమో కాని.. సుధీర్-వర్షిణి మధ్య ఎఫైర్ నడుస్తుందని వీళ్లు పెళ్లి చేసుకుంటారని, సుధీర్ రష్మికి గుడ్ బై చెప్పేసి వర్షిణితో కొత్త ఎఫైర్ మొదలుపెట్టాడని వార్తలు గట్టిగా వస్తుండటంతో వీటిపై స్పందించారు వర్షిణి. ముందుగా రష్మి-సుధీర్‌ల మధ్య కెమెస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ఆన్ స్క్రీన్‌లో రష్మి-సుధీర్ పెయిర్ చాలా బాగుంటుంది. నేను, విష్ణ ప్రియ అతనితో కలిసి చేసినా.. రష్మి-సుధీర్ జంట చూడముచ్చటగా ఉంటుంది. రష్మి ఎప్పుడూ సుధీర్‌ని తిడుతూ ఉంటుంది... సుధీర్ అలా కాదమ్మా.. ఇలా కాదమ్మా అని చెప్తూ ఉంటాడు. వాళ్ల ఇద్దరూ డాన్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఇక వర్షిణి సుధీర్‌ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదని చాలా మంది అడుగుతుంటారు.. అయితే నిజానికి నేను సుధీర్‌ని బ్రో (బ్రదర్) అని పిలుస్తాను. అతను కూడా నన్ను చెల్లెలు లాగే చూస్తాడు తిరిగి నన్ను బ్రో అని పిలుస్తాడు. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఇదే. తను నా ఫ్యామిలీ సభ్యుడుగానే అనిపిస్తుంది. చాలా కేరింగ్‌గా చూస్తాడు. దయచేసి మా రిలేషన్ గురించి తప్పుగా అనుకోవద్దు. ఆన్ స్క్రీన్‌లో మేం అలా కనిపిస్తాం కాని.. ఆఫ్ స్క్రీన్‌లో మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్.
By May 13, 2020 at 10:37AM
No comments