Breaking News

మరదలిపై బావ అత్యాచారం.. తన భర్తను సుఖపెట్టాలంటూ అక్క ఒత్తిడి


భార్య చెల్లెలిపై కన్నేసిన ఓ కామాంధుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జిల్లాలో వెలుగుచూసింది. పురులియా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దత్తుకు జమున అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. అతడు పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య చెల్లెలిపై అతడి కన్ను పడింది. అందగత్తె అయిన మరదలిని ఎలాగైనా అనుభవించాలనుకునేవాడు. Also Read: ఈ క్రమంలోనే మార్చి నెలలో ఆ యువతి అక్క ఇంటికి వచ్చింది. ఆ తర్వాత లాక్‌డౌన్ విధించడంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న దత్తు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరదలి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుమిలిపోయిన బాధితురాలు జరిగినదంతా అక్కకు చెప్పగా ఆమె మరో షాకిచ్చింది. బావకు నువ్వంటే ఇష్టం కాబట్టే అలా చేశాడని, అతడు చెప్పినట్లు వినాలని అక్క చెప్పడంతో ఆ యువతి కుమిలిపోయింది. Also Read: దీంతో బాధితురాలు అక్కడి నుంచి బయటపడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దత్తుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి వత్తాసు పలికిన జమునపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త అత్యాచారం కేసులో జైలుకు వెళ్తే తన జీవితం నాశనమవుతుందన్న ఆందోళనతోనే ఇలా చేశానని, తన చెల్లి జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని జమున పోలీసులకు చెప్పింది. Also Read:


By May 03, 2020 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-bengal-man-rapes-sisters-wife-while-she-stuked-in-his-home/articleshow/75514101.cms

No comments