Breaking News

భూ వివాదంతో సోదరుల ఘర్షణ.. తమ్ముడి చేతిలో అన్న దారుణహత్య


తెలంగాణలోని కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో దారుణం జరిగింది. భూ తగాదాలతో ఓ వ్యక్తి రక్తం పంచుకుపుట్టిన అన్ననే అతి కిరాతకంగా చంపేశాడు. మండలంలోని బోడపెల్లి గ్రామానికి చెందిన జిట్టవేని మల్లేష్‌(40), అతడి తమ్ముడు కిష్టయ్యతో పాటు మరో ఇద్దరు సోదరులు ఉన్నారు. వారసత్వంగా వచ్చిన ఎకరంపావు భూమిని కొన్నాళ్ల క్రితమే అందరూ సమానంగా పంచుకున్నారు. అయితే తనకంటే అన్న మల్లేష్‌కు ఎక్కువ భూమి వచ్చిందని కిష్టయ్య అతడిపై కక్ష పెంచుకున్నాడు. దీనిపై అన్నదమ్ముల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. Also Read: ఆదివారం ఇద్దరి మధ్య మరోసారి భూవివాదం జరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి గురైన కిష్టయ్య కర్రతో అన్న మల్లేష్‌‌ తలపై బలంగా కొట్టాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కుటుంబసభ్యులు కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లేష్‌ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి భార్య, కుమారుడు, కుమార్తె విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By May 11, 2020 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-elder-brother-in-telangana-over-property-disputes/articleshow/75667322.cms

No comments