Breaking News

నేను సింగిల్ పీస్.. ఎప్పటికీ అతనే నా బాయ్ ఫ్రెండ్.. ఆన్‌లైన్ వేదికపై అనసూయ జబర్దస్తీ!!


బుల్లితెరపై వినోదాల విందిస్తూ ప్రేక్షకులను అలరించే జబర్దస్త్ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. గత రెండు నెలలుగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన ఈ భామ.. తన హోమ్ క్వారంటైన్ విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలపై స్పందించింది. ఇన్స్‌స్టా వేదికగా నెటిజన్స్ వేసిన ప్రశ్నలన్నింటికీ ఓపిక బదులిస్తూ జబర్దస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు తన కుటుంబం, కేరీర్ సంగతులపై ఆసక్తికర సమాధానాలిచ్చింది అనసూయ. విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నానని పేర్కొంది అనసూయ. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం అని చెబుతూ.. వీలైనంత త్వరలో ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పింది. బుల్లితెర, వెండితెర కెరీర్ హాయిగా సాగిపోతోందని.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమాలో అవకాశం వస్తే నటించాలని ఉందని తెలిపింది. Also Read: ఇక ఫస్ట్‌, సెకండ్, థర్డ్ బాయ్‌ఫ్రెండ్‌.. ఇప్పటికీ తన భర్తే లోకమని, అలాగే భవిష్యత్తులో కూడా ఆయనే తన బాయ్‌ఫ్రెండ్‌ అని తెలుపుతూ వదంతులకు చెక్ పెట్టేసింది అనసూయ. తమ పదో వివాహ వార్షికోత్సవ వేడుకను ఇటలీలో చేసుకుందామని ప్లాన్ చేసాం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పింది. కాకపోతే లాక్‌డౌన్‌ ఫినిష్ కాగానే తిరుమల వెళ్లాలని ఉందని ఆమె పేర్కొంది. ఇక.. మీలాంటి అమ్మాయి నాకు లవర్‌గా రావాలని దీవించండి మేడమ్.. అని ఓ నెటిజన్ అడగగా, దానికి బదులిస్తూ ''అది కొంచెం కష్టం.. ఎందుకంటే నేను సింగిల్‌ పీస్‌! మంచి అమ్మాయి, కొంచెం నాలాంటి అమ్మాయి రావాలని ఆశిస్తున్నాను'' అంటూ జబర్దస్తీ చేసింది. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై రాణిస్తూ సత్తా చాటుతోంది అనసూయ.


By May 24, 2020 at 01:09PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anasuya-bharadwaj-says-about-her-beauty-in-latest-chit-chat/articleshow/75938250.cms

No comments