Breaking News

సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. 'విరాటపర్వం' నుంచి సర్‌ప్రైజింగ్ లుక్


నాచురల్ నటన, ముద్దుముద్దు మాటలు, అదిరిపోయే స్టెప్పులు వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్ సాయి పల్లవి. కేవలం వీటితోనే తెలుగు, తమిళ భాషల్లో మంచి పాపులారిటీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. వైవిధ్యభరితమైన కథలను, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షక లోకాన్ని ఫిదా చేసిన పుట్టిన రోజు ఈ రోజు (మే 9). ఈ సందర్భంగా ఆమె తాజా సినిమా '' నుంచి సర్‌ప్రైజింగ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. దగ్గుబాటి రానా హీరోగా 'విరాటపర్వం 1992' పేరుతో ఓ విలక్షణ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్ వేణు ఉడుగుల. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఆమె రోల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేసేలా ఆమెకు సంబంధించిన సర్‌ప్రైజింగ్ లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. మెరూన్ కలర్ లంగావోణీ ధరించి పక్కనే బ్యాగ్ పెట్టుకొని అడవిలో అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కూర్చొని కనిపిస్తోంది సాయి పల్లవి. ఈ లుక్ చూస్తుంటే సాయి పల్లవి రోల్ చిత్రానికే ప్రధాన అసెట్ అని తెలుస్తోంది. మొత్తానికి ఆమె పుట్టినరోజున సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూ సూపర్ లుక్ రిలీజ్ చేశారు విరాటపర్వం దర్శకనిర్మాతలు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా మరో వారం రోజుల షూటింగ్ పూర్తిచేయాల్సి ఉంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు. సురేష్ బాబు, చురుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నందితా దాస్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా నటిస్తున్నారు. Also Read:


By May 09, 2020 at 09:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/virataparvam-first-look-released-on-the-occuation-of-sai-pallavi-birth-day/articleshow/75640250.cms

No comments