నువ్వు దొంగ కృష్ణుడివి.. రామ్ చరణ్‌పై నానమ్మ కామెంట్స్.. వీడియో వైరల్!!
ఎప్పుడూ వెండితెరపై హుందాగా కనిపించే సెలబ్రిటీలు తమ తమ రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? తమ తమ ఖాళీ సమయాన్ని ఇంట్లో ఎలా గడుపుతారు? ఈ విషయాలు తెలుసుకోవడం కోసం సగటు ప్రేక్షకుడు ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటాడు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సెలబ్రిటీల హోమ్ క్వారంటైన్ సంగతులను, ఫ్యామిలీతో వాళ్ళు గడిపే క్షణాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ మెగా అభిమానులను కనువిందు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న రామ్ చరణ్.. తాజాగా కిచెన్ పాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు. నాన్నమ్మ అంజనా దేవి దగ్గర వెన్న తయారు చేసే విధానాన్ని తెలుసుకుంటూ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో కోడలు సురేఖకు, మనవడు రామ్ చరణ్‌కు వెన్న చిలికే విధానాన్ని నేర్పిస్తూ కనిపించింది చిరంజీవి తల్లి అంజనా దేవి. ఇక రామ్ చరణ్‌ని ఆమె కృష్ణుడిలా ఉన్నావని కామెంట్ చేయడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఇలా రామ్ చరణ్, సురేఖ, అంజనా దేవి అంతా కలిసి ఆనందంగా కిచెన్‌లో ఎంజాయ్ చేస్తూ వెన్న చిలుకుతుండటం మెగా అభిమానులను కనువిందు చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్స్ ‘‘సూపర్, నైస్ ఫ్యామిలీ’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో 'బీ ది రియల్ మాన్' ఛాలెంజ్‌లో భాగంగా తాము చేసిన ఇంటిపనుల తాలూకు వీడియోలు షేర్ చేసిన రామ్ చరణ్, చిరంజీవి మెగా అభిమానుల్లో జోష్ నింపిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే 80 షూటింగ్ ఫినిష్ చేసుకొని కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో చెర్రీతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై మెగా, నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
By May 01, 2020 at 11:58AM
No comments