Breaking News

కేసీఆర్‌ను కలవనున్న చిరు అండ్ టీమ్!


కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం 4.0 లాక్ డౌన్ నడుస్తుండగా.. ఈ సారి మాత్రం మునుపటితో పోలిస్తే చాలా వాటికి సడలింపులు ఇచ్చారు. అయితే అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీకి మాత్రం అస్సలు సడలింపులు ఇవ్వనే లేదు. కొన్ని సడలింపుల్లో భాగంగా ఏపీలో సినిమా, సీరియల్స్ షూటింగ్ చేసుకోవచ్చని ఇప్పటికే వైఎస్ జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నో చెప్పేశారు. ఏపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కేసీఆర్ కూడా త్వరలోనే శుభవార్త చెప్పొచ్చని దర్శకనిర్మాతలు, టాలీవుడ్ పెద్దలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. 

పెద్దన్న సమక్షంలో ఏం జరగబోతోంది..!

అసలు సినిమా షూటింగ్స్‌పై.. రిలీజ్‌లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..? ప్రభుత్వాలను ఎలా సంప్రదించాలి..? ఏమేం డిమాండ్ చేయాలి..? అనేదానిపై టాలీవుడ్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారట. ఇవాళ అనగా గురువారం నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదా అన్నపూర్ణ స్డూడియోస్‌లో ఇందుకు సంబంధించి ఓ కీలక సమావేశం జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి టాలీవుడ్ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత వహించనున్నారని తెలుస్తోంది. గత కొన్ని గంటలుగా ఇందుకు సంబంధించి అటు మీడియా.. ఇటు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కేసీఆర్‌ను కలిసి..!

ఈ సమావేశంలో భాగంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి నిశితంగా నివేదికను తయారు చేసి మొదట సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి అక్కడ్నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి అనుమతులిచ్చింది. మరోవైపు బాలీవుడ్ పెద్దలు కూడా ఇవాళో రేపో ప్రభుత్వాన్ని సంప్రదించే పనిలో ఉన్నారు. అందుకే పూర్తి ప్రణాళికలతో కూడిన నివేదికతో చిరు అంట్ టీమ్ (కమిటీ సభ్యులు) త్వరలోనే కేసీఆర్‌ను కలవనుందట. మరి తెలంగాణ సర్కార్ నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియాల్సి ఉంది. అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే ఈ పూట గడిస్తే కానీ తెలియదు మరి.



By May 21, 2020 at 06:54PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/51113/tollywood.html

No comments