Breaking News

భారీ చిత్రంలో స్టార్ హీరో‌తో మిల్క్ బ్యూటీ!


కేజీఎఫ్ చాప్టర్-01 చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సంపాదించుకున్నాడు యష్. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్-02 మూవీతో తన రికార్డ్‌ను తానే బద్ధలు కొట్టుకునేందుకు మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ వగైరా పనులన్నీ దాదాపు అయిపోవడంతో తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడట. కన్నడ ప్రముఖ దర్శకుడు నార్తన్‌తో తదుపరి సినిమా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది భారీ చిత్రం కావడంతో నిర్మాతలు ఎగబడుతున్నారట. లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన నార్తన్ సరికొత్త కథను తయారుచేసి యష్‌కు వినిపించగా తెగ నచ్చేసిందట. చాప్టర్-02 రిలీజ్‌ అవ్వగానే పట్టాలెక్కిద్దామని ఇద్దరూ ఓ మాట అనేసుకున్నారట.

మిల్క్ బ్యూటీనే ఎందుకంటే..?

యష్ సరసన ఎవరైతే సెట్ అవుతారా అని యోచించిన నార్తన్.. ‘బాహుబలి’ సినిమా గుర్తొచ్చిందట. పార్ట్-01లో మిల్క్ బ్యూటీ తమన్నా నటన చూసిన నార్తన్ ఆ బ్యూటీనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. భారీ చిత్రం కావడంతో తమన్నా అయితేనే న్యాయం చేస్తుందని నార్తన్ నమ్మాడట. అంటే నార్తన్ సినిమాలో కూడా యుద్ధ సన్నివేశాలు ఉంటాయేమో. ఆమెను సంప్రదించి స్టోరీలైన్ కూడా చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందట. ఇదే నిజమైతే మాత్రం మిల్క్ బ్యూటీ నక్క తోక తొక్కినట్లే. ఇదివరకే తమన్నా.. యష్ సరసన స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

మళ్లీ ఊపందుకుంటుంది!

వాస్తవానికి ఈ మధ్య కాలంలో తమన్నా కెరీర్ కూడా అంత ఆశాజనకంగా లేదు. ఈ భామ ఖాతాలో హిట్ పడి చాలా రోజులే అయ్యింది. ఒక పెద్ద సినిమా ఎప్పుడెప్పుడు తనను వరిస్తుందా అని ఎన్నో రోజులుగా వేచి చూస్తోంది. యష్‌ కూడా ఇప్పుడు కన్నడలో స్టార్ హీరో.. ఆయన సరసన నటించడం నిజమే అయితే మళ్లీ కెరీర్ ఊపందుకుంటుంది. మరీ ముఖ్యంగా కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నార్తన్ భావిస్తున్నాడట. ప్రస్తుతం నిర్మాత ఎవరనే విషయం తేల్చే పనిలో ఆయన నిమగ్నమయ్యారట. అన్నీ సెట్ అవ్వగానే అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.



By May 02, 2020 at 08:58PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/50875/tamanna-bhatia.html

No comments