విఘ్నేశ్‌తో నయనతార గొడవ.. మళ్లీ బ్రేకప్..!?
లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి నటన పరంగా ప్రత్యేకించి మరీ తెలుగు, తమిళ సినీ ప్రియులకు చెప్పనక్కర్లేదు. రీల్ లైఫ్ వరకూ అంతా ఓకే గానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు.. అసలు ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. ఇప్పటికే పలువురితో ప్రేమలో మునిగి తేలిన ఈ సీనియర్ నటి.. ఏం జరిగిందో ఏమోగానీ.. ఒక్కరూ ఈమెతో లైఫ్ పంచుకోలేదు. అలా అటు తిరిగి.. ఇటు తిరిగి చివరికి డైరెక్టర్ విఘ్నేశ్ వద్ద వచ్చి ఆగింది. మిగిలిన వారితో ఉన్న బాండింగ్‌తో పోలిస్తే.. వీరిద్దరు మాత్రం చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే విదేశాలన్నీ తిరిగేశారు కూడా.. డేటింగ్‌లో కూడా ఉన్నారని టాక్ నడిచింది. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే.. గత ఏడాది క్రిస్మస్‌కే పెళ్లి బాజాలు మోగాల్సింది కానీ ఎందుకో ఆలస్యమైంది. అలా మూడేళ్లుగా తిరిగిన వీరి ఈ లవ్ బర్డ్స్ గురించి తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది.
విఘ్నేశ్‌తో బ్రేకప్..!
అదేమిటంటే.. విఘ్నేశ్‌తో కూడా నయన్ విడిపోయిందని తమిళ వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయ్. ఇటీవల పెళ్లి విషయమై నయన్ గొడప పెట్టుకుందట. అలా వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని దీంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకున్నారట. అంటే మూడో ప్రేమ కూడా విఘ్నేశ్‌తో ముక్కలైపోయిందన్న మాట. అయితే.. విఘ్నేశ్ వర్షన్ మాత్రం ఇంకోలా ఉందట. వేరే కుర్ర డైరెక్టర్‌తో నయన్ సన్నిహితంగా ఉండటంతో వదిలేయాలని అనుకున్నాడట అని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మాటల్లేవని.. ఒకరినొకరు కలుసుకోవట్లేదని తమిళ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయ్.
రియాక్షన్ రాలేదేం..!
ఇలాగే పెద్ద ఎత్తున వార్తలు వస్తుండటంతో జనవరిలో రియాక్ట్ అయిన నయన్.. తన కలలను నిజం చేసుకోవడంలో విఘ్నేశ్ శివన్ సహకారం ఎంతో ఉందని.. తాను ఆయనతో ప్రేమలో పడినప్పట్నుంచీ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఆయన ప్రేమలో నేను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని కూడా చెప్పి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే అప్పట్లో పుకార్లు వచ్చిన గంటల్లోనే స్పందించిన ఆమె.. తాజాగా వస్తున్న వార్తలపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇదంతా నిజమేనేమోనని అభిమానులు షాక్‌లో ఉన్నారట. నయన్ లైఫ్ ఎవరితో రాసి పెట్టుందో.. ఏంటో గానీ.. రియల్ లైఫ్‌లో ఒక్కటి కూడా లేడీ స్టార్‌కు అనుకున్నట్లు జరగట్లేదు.
By May 02, 2020 at 08:32PM
No comments