అబ్బాయితో మాట్లాడారని ఇద్దరు బాలికల హత్య.. పాక్‌లో దారుణం
పాకిస్థాన్ దేశంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. ఓ అబ్బాయితో మాట్లాడారన్న అక్కసుతో చెందిన ఇద్దరు బాలికలను కుటుంబ సభ్యులే కాల్చి చంపారు. పాకిస్తాన్‌లోని ఉత్తర వాయువ్య గిరిజన ప్రాంతంలో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. 16, 18 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు బాలికలు మే 14న హత్యకు గురయ్యారు. అంతకు కొద్దిరోజుల ముందు వీరిద్దరు ఓ యువకుడితో సన్నిహితంగా మెలుగుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. వారి ప్రవర్తనపై ఆగ్రహం చెందిన కుటుంబసభ్యులే ఇద్దరు బాలికను హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఒకరు బాలిక తండ్రి కాగా, మరొకరు బాలిక సోదరుడిగా గుర్తించారు. Also Read: అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న మూడో బాలిక, యువకుడికి ప్రాణహాని ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో వారిద్దరికి భద్రత కల్పించారు. ఈ పరువు హత్యలపై స్థానికంగా అనేక సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఏటా వెయ్యి మందికి పైగా పరువు హత్యలకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. Also Read:
By May 19, 2020 at 10:57AM
No comments