Breaking News

దేశంలో 85వేలకు చేరిన కరోనా కేసులు.. చైనాను దాటేసిన భారత్


ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసుల నమోదయిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానానికి ఎగబాకింది. తొలిసారి కరోనా మహమ్మారి వెలుగుచూసిన చైనాను అధిగమించడం గమనార్హం. శుక్రవారం దేశవ్యాప్తంగా మరో 3,787 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 105 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 85,784కి చేరగా.. మరణాల సంఖ్య 2,753గా నమోదయ్యింది. వరుసగా ఆరో రోజు 3,500కిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్రం వెల్లడించిన అధికారిక గణాంకాలు మాత్రం పాజిటివ్ కేసులు 84,031గా పేర్కొంటున్నాయి. Read Also: శుక్రవారం మహారాష్ట్రలో 1,576 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (434), ఢిల్లీ (425), గుజరాత్ (340), రాజస్థాన్ (213), మధ్యప్రదేశ్ (169), ఉత్తరప్రదేశ్ (155), ఆంధ్రప్రదేశ్ (102), పశ్చిమ్ బెంగాల్ (84), కర్ణాటక (69), తెలంగాణ (40) ఉన్నాయి. అయితే, మే 10న అత్యధికంగా 4,308 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు వెలుగుచూసిన తర్వాత ఇప్పటి వరకూ ఒక రోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ప్రతి మూడు రోజులకు ఒకసారి పాజిటివ్ కేసుల గరిష్ఠానికి చేరినప్పుడు.. ఇది గత నెలలో సగటు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. Read Also: మహరాష్ట్రలో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత పది రోజుల నుంచి రోజూ 1,000కిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 1,576 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 29,000 దాటింది. గడచిన 24 గంటల్లో మరో 49 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 1,068గా నమోదయ్యింది. ముంబయిలోనే కొత్తగా 933 మంది వైరస్ బారినపడగా.. అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 17,671గా నమోదయ్యింది. 34 మంది ప్రాణాలు కోల్పోయారు. Read Also: తమిళనాడు సైతం 10వేల మార్క్ దాటింది. శుక్రవారం 434 కేసులు నమోదు కాగా.. ఒక్క చెన్నై నగరంలోనే 309 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆ రాష్ట్రంలో మొత్తం మరణాలు 71కి చేరాయి. నాలుగు రోజుల్లో 8 వేల నుంచి 10వేలకు పాజిటివ్ కేసులు చేరడం గమనార్హం. ఢిల్లీలో మహమ్మారి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. అక్కడ బాధితుల సంఖ్య 8,895కి చేరింది. మొత్తం 123 మంది ఇప్పటి వరకూ కరోనాతో చనిపోయారు. Read Also: ఇక, గుజరాత్‌లో ఉద్ధృతంగా ఉంది. పాజిటివ్ కేసులు 10వేలకు చేరువలో ఉన్నాయి. మరణాలు రేటు కూడా జాతీయ సగటుతో పోల్చితే ఎక్కువగా ఉంది. మొత్తం 606 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఇక్కడే కోవిడ్‌తో చనిపోతున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య 9,932కి చేరింది. ఒడిశా, ఝార్ఖండ్‌లో వలస కూలీల వల్ల పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు వైరస్ నిర్ధారణ అవుతోంది.


By May 16, 2020 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-india-rose-to-the-11th-spot-among-countries-with-highest-number-of-cases-overtaking-china/articleshow/75769408.cms

No comments