బెంగళూరులో బీహార్ దంపతుల ఆత్మహత్య.. 5 నెలల క్రితమే పెళ్లి
రాజధాని బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చిన నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బీహార్‌కు చెందిన రాహుల్ (30), రాణి (26) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఐదు నెలల క్రితం వివాహం చేసుకుని 4 నెలల క్రితం బెంగళూరుకు వలస వచ్చారు. మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపుర ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా 40 రోజులు పాటు ఇంటికే పరిమితం దంపతులు చివరికి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. కరెంట్ బిల్లు ఇచ్చేందుకు ఇంటి యజమాని వారి గదికి వెళ్లిన సమయంలో దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. Also Read: జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని వలస వచ్చిన రాహుల్, రాణి 40 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. వచ్చినప్పటి నుంచి స్థానికులు ఎవరితోనూ వారు సరిగ్గా మాట్లాడేవారు కాదు. శుక్రవారం వీరిద్దరి ఆత్మహత్య చేసుకున్నారన్న సంగతి తెలుసుకున్న స్థానికులు ఆవేదనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న శ్రీరాంపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాణి ఫ్యాన్‌కు ఉరేసుకోగా.. రాహుల్ విషం తాగినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దంపతుల మధ్య కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read:
By May 03, 2020 at 11:25AM
No comments