నందమూరి Vs మెగా ఫ్యామిలీ వార్ ముగిసినట్టే.. చరణ్ నన్ను అనుసరిస్తున్నాడన్న చిరు
‘పెద్ద ఫ్యామిలీనా.. మాలాగా.. వాళ్లెంత బురద జాతి’ అంటూ సీన్ పండటం కోసం బాలయ్య బాబు డైలాగ్ చెప్పినా.. అది ఫ్యాన్స్ మధ్య వైరాన్ని పెంచింది. ఇప్పుడే కాదు సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి పెద్ద పండుగలకు ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ మధ్య యుద్ధమే నడిచేది. అప్పట్లో అయితే సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ప్రత్యక్షంగానే ఫ్యాన్స్ వార్‌కి దిగేవారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చొక్కాలు చించుకునే పిచ్చి ఫ్యాన్స్‌కి టాలీవుడ్‌లో కరువు లేకపోవడంతో హీరోల మధ్య మంచి అనుబంధమే ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుచచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. యువ హీరోలు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తే ఈ ఫ్యాన్స్ గోల తగ్గుతుందో మార్గదర్శకాలు వెతుకుతున్నారు. ఒక హీరో సినిమా ఫంక్షన్ మరో హీరో వెళ్లడం.. మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం.. ఒక హీరో సినిమాను మరో హీరో ప్రమోట్ చేయడం ద్వారా ఈ ఫ్యాన్స్ మధ్య రగడను దాదాపు నివారించడం శుభపరిణామం. ఇంకా కొంతమంది హీరోల ఫ్యాన్స్ తమ హీరోనే గొప్ప అంటూ డబ్బాలు కొట్టుకుంటూనే ఉన్నారు కాని.. వాళ్లని సెపరేట్ క్యాటగిరీ కింద వదిలేసి హీరోలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతూ తామంత ఒక్కటే అనే మెసేజ్ ఇస్తున్నారు. యువ స్టార్ హీరోల మధ్య ఇలాంటి మంచి వాతావరణం ఉండటం శుభపరిణామం అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలంగా టాలీవుడ్‌లో నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య వైరం ఉండనే ఉంది. వీటికి చిత్రంతో పూర్తిగా ఫుల్ స్టాప్ పడినట్టే. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన స్టార్ హీరోలో ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న సఖ్యతను ఫ్యాన్స్ కూడా పాటిస్తున్నారు. ఇంతకు హీరోను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అతను నటించిన సినిమాను డీగ్రేట్ చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి పని చేస్తే నష్టం తమకు కూడా అనే సత్యాన్ని గ్రహించడంతో ఇండస్ట్రీలో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడింది. ఈ ఇష్యూపై చిరు మాట్లాడుతూ... హీరోల మధ్య సఖ్యత అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇప్పుడు యువ హీరోలందరిలోనూ ఒకరిపట్ల ఒకరికి సఖ్యత ఉండటం మంచి పరిణామం. దాని వల్ల ఫ్యాన్స్‌లో కూడా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మా తరంలో కూడా మిగతా హీరోలను కలుపుకుని పోవాలని చూసేవాడిని. నా తోటి హీరోలతో స్నేహం చేయడానికి పరితపించేవాడిని ఇప్పుడు చరణ్ కూడా ఈ విషయంలో నన్ను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా చరణ్-ఎన్టీఆర్‌ల మధ్య స్నేహం చూస్తే ముచ్చట వేస్తుంది. ఇలాంటి వాతావరణం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు మెగాస్టార్. గతంలో చరణ్- అక్కినేని అఖిల్ ఫ్రెండ్ షిప్‌పై కూడా ఇదే విధమైన కామెంట్ చేశారు చిరు.
By April 29, 2020 at 08:05AM
No comments