Breaking News

‘ఉప్పెన’ రీమేక్‌లో హీరోగా ఇళయదళపతి కొడుకు!


కథ నచ్చితే చాలు తెలుగు నుంచి ఇతర భాషల్లోకి.. ఇతర భాషల్లో నుంచి తెలుగులోకి సినిమాలు రీమేక్ అయిపోతుంటాయ్. హిందీ, తమిళ్, మలయాళతో పాటు పలు భాషల నుంచి ఎక్కువగా సినిమాలు మన తెలుగులోకి రీమక్ అవుతుంటాయ్. అంతేకాదు.. మన తెలుగులో కథ నచ్చితే బాలీవుడ్ వాళ్లు కూడా రీమేక్ చేసేస్తుంటారు. అయితే విచిత్రం ఏమిటంటే టాలీవుడ్‌లో ఇంకా రిలీజ్ కాని చిత్రాన్ని కూడా తమిళంలో రీమేక్ చేస్తు్న్నారంటే టాలీవుడ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ సినిమాతో పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియట్లేదు కానీ.. తమిళంలో రీమేక్ అవ్వనుంది. ఇందులో విలన్‌గా నటిస్తున్న స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ సేతుపతి.. ఇందుకు సంబంధించిన రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో హీరోగా ఎవరు నటిస్తారా..? అని ఆరాతీయగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. 

తమిళ స్టార్ హీరో, ఇళయదళపతి కుమార్ విజయ్ తన కుమారుడు జాసన్ సంజయ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్నాడు. అయితే మంచి టీనేజ్ లవ్ స్టోరీ కోసం వేచి చూస్తున్నాడు. అయితే ఇలాంటి తరుణంలో విజయ్ సేతుపతితో చర్చించగా.. ‘ఉప్పెన’ గురించి చెప్పాడట. కథ కూడా చాలా బాగుందని.. సంజయ్ ఎంట్రీకి ఇది సరిగ్గా సెట్ అవుతుందని చెప్పగా.. ఓకే చెప్పాడట. అంతేకాదు.. తెలుగులో చిత్రీకరించిన డైరెక్టర్ అక్కడ కూడా తెరకెక్కిస్తాడట. విజయ్ సేతుపతే విలన్‌గా నటిస్తాడని టాక్ నడుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.



By April 24, 2020 at 07:44PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/50751/vijays-son.html

No comments