వాట్సాప్ స్టేటస్‌గా కరోనా సోకిన యువతి ఫోటో.. యువకుడి అరెస్ట్
కరోనా రోగుల విషయంలో గోప్యత పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్నా కొందరు పట్టించుకోడం లేదు. ఇలాగే కర్ణాటకకు చెందిన ఓ యువకుడు ఫోటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుని చిక్కుల్లో పడ్డాడు. విజయపుర జిల్లాకు చెందిన అనిల్ రాథోడ్ అనే యువకుడు(24) శనివారం ఓ యువతి ఫోటోను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి.. ‘బ్యాడ్ న్యూస్.. ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చింది’ అని క్యాప్షన్ పెట్టాడు. Also Read: ఆ వాట్సాప్ స్టేటస్ చూసి వారిలో కొందరికి ఆ అమ్మాయి తెలుసు. మరికొందరేమో ఆ అమ్మాయి ఎక్కడుంటుంది?, ఏమైనా సాయం కావాలా? అంటూ అతడికి మెసేజ్‌లు పెట్టారు. మరికొందరేమో ఇలా ఫోటో పెట్టి ఆ అమ్మాయి పరువు తీస్తావా? అంటూ అతడిని తిట్టిపోశారు. ఆ అమ్మాయి ఫోటోను డిలీట్ చేయాలంటూ కొందరు ఫోన్ చేసి అతడిని బెదిరించారు. ఈ విషయం అమ్మాయి ఉండే ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. Also Read: ఈ విషయం కాస్తా పోలీసులకు చేరడంతో వెంటనే ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. కరోనా రోగుల వివరాలను బయటపెట్టకూడదు. ఆ నిబంధనలను అతిక్రమించడంతో యువకుడు చిక్కుల్లో పడ్డాడు. యువతి ఫోటోను తన వాట్సాప్ స్టేటస్ మెసేజ్ పెట్టడంతో యువకుడు ప్రజల్లో భయాందోళన కలిగించాడని, ఆమె పరువు తీయాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read:
By April 27, 2020 at 11:43AM
No comments