Breaking News

ఇంట్లో ఖాళీగా ఉండకుండా భార్యలకు సాయం చేయండి... భర్తలకు సీఎం సలహా


క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశ‌వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగ, వ్యాపార పనుల్లో నిత్యం బిజీగా ఉండే మగవాళ్లు కొద్దిరోజులుగా ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే బయట తిరగడం అలవాటు పడిన వారు మాత్రం రోజంతా ఇంట్లో ఉండటాన్ని భారంగా భావిస్తున్నారు. తమ బాధను టిక్‌టాక్ లాంటి యాప్‌ల ద్వారా వెళ్లగక్కుతున్నారు. మరోవైపు ఇంట్లో ఉండే మగవారు రోజూ ఏదొక స్పెషల్ డిష్ చేయాలని వేధిస్తున్నారంటూ మహిళలు సైతం సోషల్‌మీడియా ద్వారా తమ గోడు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి ఓ చక్కటి సలహా ఇచ్చారు. ఇంట్లో ఉండే మగవాళ్లు బోర్‌గా ఫీల్ కాకుండా ఉండాలంటే ఆడవాళ్లకు ఇంటి పనుల్లో సాయం చేయాలని పిలుపునిచ్చారు. Also Read: లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు ఆడవాళ్లపై పనిభారం మోపకుండా, మగవాళ్లు కూడా పనులు చేయాలని నవీన్ పట్నాయన్ సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధానంగా వంట విషయంలో మహిళలపై ఒత్తిడి తీసుకురావొద్దు. రోజురోజుకు వేసవి తాపం పెరుగుతున్నందున‌ మహిళలు ఎక్కువ‌సేపు వంటింట్లో ఉంటే కుంగిపోతార‌ని, మ‌హిళ‌లు కుంగిపోతే దేశం కూడా కుంగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మ‌గ‌వాళ్లు ఇల్లాలి క‌ష్టాల్లో పాలు పంచుకుని మ‌మ‌కారం చాటుకోవాల‌ని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. Also Read:


By April 01, 2020 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/odisha-cm-naveen-patnaik-request-husbands-help-to-wives-in-lock-down-time/articleshow/74924256.cms

No comments