Breaking News

ఏపీలో క్వారంటైన్ కేంద్రాలపై తప్పుడు ప్రచారం.. తెలంగాణ వ్యక్తి అరెస్ట్


కరోనాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. వాట్సాప్‌, ఫేస్‌బుక్ గ్రూపుల్లో వచ్చిన సమాచారాన్ని చెక్ చేసుకోకుండా ఫార్వాడ్ చేయడం, దానిపై స్పందించినా పోలీసులు జైలుకు పంపిస్తున్నారు. జిల్లా వినాయక ఆలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చారంటూ ఇటీవల సోషల్‌మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. Also Read: అయితే ఇదంతా అసత్యమని, ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారంటూ తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి (56) తన ఫేస్‌బుక్, ట్విటర్‌ ఖాతాల్లో తప్పుడు పోస్టులు చేశాడు. దీనిపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. తన స్నేహితులు, బంధువులకు దాన్ని పంపించారు. ఈ వీడియో కాణిపాకం ఆలయ ఈఓకి చేరడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: దీంతో చిత్తూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన్ని కోర్టులో హాజరు పరచి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. కరోనాపై ఫేక్ న్యూస్‌ ప్రచారం చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మార్చి నెలలో పలమనేరుకు చెందిన ఓ చార్టెడ్‌ అకౌంటెంట్‌కు కరోనా సోకిందంటూ ఫేస్‌బుక్, వాట్సప్‌లలో మెసేజ్‌ పెట్టినందుకు గంగవరానికి చెందిన కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. Also Read:


By April 16, 2020 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chittoor-police-arrests-telangana-man-over-spreading-fake-news-against-kanipakam-quarantine-centre/articleshow/75173273.cms

No comments