దర్శకనిర్మాతలతో అన్నీ అలాంటి అనుభవాలే.. శ్రీయ సంచలన ఆరోపణలు
‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శరణ్.. టాలీవుడ్ లోని అందరు అగ్రహీరోల సరసన నటించింది. అందం, అందుకు తగ్గ అభినయంతో హవా కొనసాగించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ టాప్ రేంజ్ క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల జోష్ తగ్గించింది. భర్తతో సరదా షికార్లు కొడుతూ సామాజిక మాధ్యమాల వేదికగా టచ్‌లో ఉంటోంది. 40 ఏళ్ల ప్రాయంలోనూ హాట్ హాట్ ఫోజులిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. అయితే మంచి అవకాశం వస్తే మళ్ళీ వెండితెర జోష్ కొనసాగిస్తా అంటోంది కానీ, సినిమా మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు శ్రీయ. దీంతో మీకు అవకాశాలు రావడం లేదా? లేక కావాలనే ఇలా దూరంగా ఉంటున్నారా? అంటే ఆసక్తికర సమాధానమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే కొందరు దర్శకనిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసింది. కొంతమంది దర్శకనిర్మాతలు చెప్పే కథ ఒకటి, తీసే కథ మరొకటిగా ఉంటోందని, ఇటీవలి కాలంలో అన్నీ అలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని అంటోంది శ్రీయ. ఏదో ఒకటి రెండు లైన్ల స్టోరీలైన్స్ చెప్పి మోసం చేస్తున్నారని వాపోయింది. అందుకే వచ్చిన కథలన్నీ ఓకే చేయడంలేదని, పూర్తి కథ విన్నాకే ఓకే అంటానని శ్రీయ చెప్పుకొచ్చింది. Also Read: ఇక ఐటెం సాంగ్స్‌లో చేయడంపై స్పందించిన శ్రీయ.. స్పెషల్ సాంగ్స్ చేస్తే హీరోయిన్లుగా అవకాశాలు రావేమో అనే భయాన్ని మొదటగా పోగొట్టింది తానే అని తెలిపింది. ఇప్పుడైనా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీగా ఉన్నా.. కాకపోతే సినిమాలో ఆ సాంగ్‌కి ప్రాధాన్యం ఉండాలని, అది సినిమాకి ప్లస్ కావాలని.. అలాంటిదైతేనే తాను ఒప్పుకుంటానని ఆమె వెల్లడించింది.
By April 25, 2020 at 12:22PM
No comments