మరో మహిళతో అఫైర్.. అడ్డుగా ఉందని భార్య చంపి.. కడపలో దారుణం
పరాయి మహిళతో పెట్టుకున్న ఆ వ్యక్తి భార్య అందంగా కనిపించలేదు. దీంతో తన సుఖానికి అడ్డుగా ఉందని భావించి ఆమె ప్రాణాలు తీసేశాడు. ఈ ఘటన జిల్లా గాలివీడు మండలంలో వెలుగుచూసింది. పేరంపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లె వాసి పర్వీన్(30)కు బాబ్‌జాన్ అనే వ్యక్తితో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉపాధి నిమిత్తం బాబ్‌జాన్ ఐదేళ్లుగా గల్ఫ్‌లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేశాడు. Also Read: తన భార్య అందంగా ఉండదని భావించే బాబ్‌జాన్ గల్ఫ్‌లో పరిచయమైన తన ప్రాంతానికి చెందిన మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆరు నెలల కిందట ఆమెను స్వస్థలానికి తీసుకొచ్చి గాలివీడు గేటు సమీపంలో ఇల్లు తీసుకుని సహజీవనం మొదలుపెట్టాడు. మళ్లీ గల్ఫ్‌కు వెళ్లి రెండు నెలల క్రితం ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి తనకు విడాకులు ఇవ్వాలంటూ భార్య పర్వీన్‌ను వేధించడం మొదలుపెట్టాడు. గతంలో ఓ సారి భార్యను చంపేందుకు పథకం వేసినా ఫలించలేదు. ముస్లిం పెద్దల పండుగ రోజున ఇంట్లోని నగలు అమ్మేయడంతో పర్వీన్ భర్తతో గొడవపడింది. Also Read: దీనిపై కక్ష పెంచుకున్న పర్వీన్ బుధవారం పర్వీన్ నిద్రపోతున్న సమయంలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. గురువారం ఉదయం ఆమె అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే తన సోదరిని భర్త జాబ్‌జాన్‌తో పాటు అత్తమామలు కలిసి హత్య చేశారని బాబ్జి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పర్వీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. Also Read:
By April 17, 2020 at 08:06AM
No comments