Breaking News

బీజేపీ లీడర్ కొడుకుతో కీర్తి సురేష్ పెళ్లి?


టాలీవుడ్ ‘మహానటి’.. జాతీయ ఉత్తమ నటి పీటలు ఎక్కబోతుందా? అంటే అవుననే సమాధానాలు కోలీవుడ్ నుంచి వినిపిస్తున్నాయి. తక్కువ కాలంలోనే దక్షణాదిలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యిందట. ప్రముఖ బీజేపీ నాయకుడు కుమారుడు, బిజినెస్ మ్యాన్‌తో పెళ్లికి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు పెళ్లిపనుల్లో ఉన్నట్టు సమాచారం. అయితే ఆ వరుడు ఎవరు? ఆ బీజేపీ నాయకుడు ఎవరు? అనే విషయాలను ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచారని ఈ లాక్ డౌన్ లేకపోతే ఆ వివరాలు కూడా బయటకు వచ్చేవని తెలుస్తోంది. కీర్తి సురేష్ వివాహానికి సంబంధించిన గుట్టు ప్రముఖ నటుడు ఫూల్ వాన్ రంగనాథన్ మీడియా లీక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే కీర్తి పెళ్లి విషయంపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఇక కీర్తి సురేష్ మహానటి చిత్రంతో అద్భుత నటనను ప్రదర్శించి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం నితిన్‌తో ‘రంగ్ దే’ అనే రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె అనుగా కనిపించబోతున్నారు. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 'గుడ్‌ లక్‌ సఖి' అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రంలోనూ డీ గ్లామరస్ రోల్ చేయబోతుంది కీర్తి సురేష్.


By April 04, 2020 at 12:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahanati-actress-keerthy-suresh-set-to-marry-a-popular-businessman-soon/articleshow/74979126.cms

No comments