వైఎస్ జగన్ బయోపిక్‌లో ఏమేం ఉంటాయ్..!?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సినిమాకెళ్లిన అభిమానులు కంటతడి పెట్టుకుంటూ బయటికొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. ఈ బయోపిక్‌తో దర్శకుడు మహి వి రాఘవ పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మార్మోగింది. అంతేకాదు.. బయోపిక్ ఈయన తర్వాతే ఎవరైనా అని పెద్ద పెద్ద దర్శకనిర్మాతలే అనుకున్నారు కూడా. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన బయోపిక్‌లన్నీ అట్టర్ ప్లాప్ అవ్వడం కూడా మహికి బాగా కలిసొచ్చిన విషయం.
కచ్చితంగా ఉంటుంది..
ఇక అసలు విషయానికొస్తే.. ‘యాత్ర’ తర్వాత వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ కూడా తెరకెక్కనుందని అప్పట్లోనే వార్తలు వినిపించాయ్. అయితే తాజాగా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కచ్చితంగా బయోపిక్ ఉంటుందని స్వయంగా మహినే ఓ ఇంటర్వ్యూ వేదికగా చెప్పేశారు. ‘వైఎస్సార్ కథను సినిమాగా చేయడానికి ఇబ్బంది పడ్డాను కానీ.. జగన్ జీవితం గురించి ఏ ఇబ్బందులు లేవు. ఎందుకంటే జగన్ జీవితంలో గాడ్ ఫాదర్ అంత లోతు ఉంటుంది. జగన్ లైఫ్‌లో హీరోయిజం, కష్టాలు, దరిద్రం, అడ్మినిరేషన్, పోరాటం.. ఇలా అన్నీ ఉన్నాయి. ఆయన జీవితం మంచి ఎమోషనల్ జర్నీగా అవుతుంది. 2022లో గానీ 23లో కచ్చితంగా తెరకెక్కిస్తాను’ అని మహి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ఏమేం ఉంటాయ్..!
దర్శకుడి ప్రకటనతో వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానుల్లో ఆనందానికి హద్దులేవ్. సోషల్ మీడియాలో వైఎస్ జగన్-మహి ఉన్న ఫొటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ‘యాత్ర’తో గ్రాండ్ సక్సెస్ అయిన మహి.. జగన్ బయోపిక్‌కు ఏమని పేరు పెడతారు..? హీరో ఎవరు..? బయోపిక్‌లో జగన్ చదవు, బిజినెస్, రాజకీయ ప్రస్థానం, సీఎం పీఠమెక్కడం, పథకాలు..తో పాటు ఇంకా ఏమేం ఉంటాయ్.. జగన్‌లోని కాంట్రవర్సీ యాంగిల్‌ను కూడా టచ్ చేస్తారా..? ఈ బయోపిక్‌తో ఎవర్ని మెప్పిస్తారు..? ఎవర్ని టార్గెట్ చేస్తారు..? అనే విషయాలు తెలియాలంటే 2023 వరకూ వేచి చూడాల్సిందే మరి.
By April 29, 2020 at 04:26PM
No comments