Breaking News

విజయనిర్మల బయోపిక్‌పై క్లారిటీ వచ్చేసింది!


టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్.. బయోపిక్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇప్పటికే రాజకీయాలు.. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన పలువురు ప్రముఖుల బయోపిక్‌లు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్టవ్వగా.. మరికొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. వాటిగురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం కూడా. తాజాగా.. సీనియ‌ర్ న‌టి, నిర్మాత‌, ద‌ర్శకురాలు, గిన్నిస్‌బుక్ రికార్డ్ హోల్డర్ విజ‌య నిర్మల బయోపిక్ తెరకెక్కుతున్నట్లు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఇదిగో ఫలానా హీరోయిన్ ఆమె పాత్రలో నటిస్తోందని వార్తలు కూడా వచ్చేస్తున్నాయ్.

మళ్లీ కీర్తీ పేరే..!

‘మహానటి’ చిత్రంతో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఉత్తమ నటి కీర్తి సురేషే మళ్లీ.. ఈ బయోపిక్‌లో నటిస్తోందట. కీర్తి అయితే విజయనిర్మల పాత్రకు న్యాయం చేస్తుందని నమ్మిన తనయుడు నరేష్‌ ఆమెను సంప్రదించాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయ్. అయితే కీర్తి నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదని.. దాదాపు ఆమె ఒప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఇందుకు సంబంధించిన వార్తలు అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో తెగ హల్‌చల్ చేయడంతో ఓ ఇంటర్వ్యూ వేదికగా నరేష్ క్లారిటీ ఇచ్చుకున్నారు.

నిజమే కానీ..!

అమ్మ బయోపిక్ అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తమేనని ఆ పుకార్లను నరేష్ కొట్టి పారేశారు. నా త‌ల్లి బ‌యోపిక్‌పై వ‌స్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేద‌ు. బ‌యోపిక్ తీస్తామని నన్ను ఎవరూ సంప్రదించలేదు. అంతేకాదు బయోపిక్ తీయండని ఎవరికీ చెప్పలేదు.. అనుమతి కూడా తీసుకోలేదు. ప్రస్తుతం అమ్మగారి జీవితంపై మ‌రింత రీసెర్చ్ చేస్తున్నాను. ఇది పూర్తి కావ‌డానికి ఇంకా సమయం పడుతుంది. అవన్నీ పూర్తవ్వగానే బయోపిక్‌ వ్యవహారం ఫోకస్ పెడతాను.. ఆ తర్వాత అన్ని విషయాలు చెబుతాను అని నరేష్ చెప్పుకొచ్చారు. అంటే బయోపిక్ తీయడం పక్కా కానీ ఇప్పుడు కాదని చెప్పకనే చెప్పేశాడన్న మాట.



By April 29, 2020 at 04:24PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/50821/vijaya-nirmala.html

No comments