ఎమ్మెల్యే వేధింపులు.. ఉరేసుకుని డాక్టర్ ఆత్మహత్య
దేశ రాజధాని ఢిల్లీలో డాక్టర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన రెండు పేజీల సూసైడ్ నోట్ రాశారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర సింగ్ అనే డాక్టర్ ఢిల్లీలోని నెబ్ సారాయ్ ప్రాంతంలో నివాసముంటున్నారు. వైద్య వృత్తితో పాటు ఆయన వాటర్ ట్యాంకర్ల వ్యాపారం చేస్తున్నారు. నీళ్లు కావాల్సిన వారికి ఆయన వాటర్ ట్యాంకర్ల జలమండలి నుంచి నీటిని సేకరించి అందించేవి. Also Read: కొన్నా్ళ్లుగా ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ ఆయన్ని డబ్బుల కోసం వేధిస్తున్నాడు. తనకు కమిషన్ ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటానని బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయిన ఆయన శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఓ డైరీ, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాడు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తనను వేధించిన తీరును డాక్టర్ సూసైడ్ నోట్‌లో వివరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ తీరుపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. 2018లో మహిళలను బెదిరించిన ఘటనలో ఆయన మీద కేసు నమోదైంది. ఇప్పుడు డాక్టర్ ఆత్మహత్యతో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. Also Read:
By April 19, 2020 at 09:37AM
No comments