Breaking News

దేనితో నవ్వాలో అర్థం కావడం లేదు.. మాధవీలతపై మళ్లీ అటాక్.. ఈసారి బీప్స్ వెయ్యాల్సిన బూతులు


వర్సెస్ .. సరిపోయింది.. ఇద్దరికీ ఇద్దరే.. తిట్లు తిట్టుకోవడంలోనూ, మాటలు జారడంలోనూ, కాంట్రవర్శీ కావడంలోనూ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ తక్కువ కాదు. పోయి పోయి ఈ ఇద్దరి మధ్య వివాదం రాజు కుంటే రచ్చ ఏవిధంగా ఉంటుంది అనడగానికి గత వారం రోజులుగా ఈ ఇద్దరి మధ్య ఫేస్ బుక్ వేదికగా పేలుతున్న మాటలు తూటాలు, బూతు బాండారాలు చూస్తే అర్థమైపోతుంది. అయితే క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య వైరం ఉన్నప్పటికీ మరో మారు ఈ ఇద్దరి మధ్య వివాదానికి కేంద్రబిందువు అయ్యింది ‘మల్లెపూల’ రచ్చ. ఇటీవల తెలుగు దేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన సాధినేని యామినిపై విమర్శలు గుప్పిస్తూ ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇవ్వడంతో మల్లెపూలు బాగా నలిపిందనా.. బూతులు బాగా తిట్టిందనా పదవి ఇచ్చారు.. తిట్టిన వాళ్లకే పదవులా? అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది మాధవీలత. ఆమె కూడా బీజేపీలో యువ నాయకురాలు కావడం.. పైగా మాధవీలత గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజక వర్గాన్ని ఈసారి సాధినేని యామినికి ఇవ్వబోతున్నారనే టాక్ ఉండటంతో మాధవీలతపై సాధినేని యామినిపై గట్టిగానే రియాక్ట్ అయ్యారు. Read Also: అయితే ఈ ఇష్యూలో శ్రీరెడ్డి ఎంటరై మాధవీలతకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘నా ఫుల్ సపోర్ట్ సాధినేని యామినికి.. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ బయటకు తీయాల్సి వస్తుంది.. నువ్వు థంజెండ్స్ సార్లు.. సారీ!! లక్ష టైమ్స్ మల్లెపూలు పిసికావో మరిచిపోయావా?’ అంటూ మాధవీలతకు కౌంటర్ ఎటాక్ ఇచ్చింది శ్రీరెడ్డి. ఇక మాధవీలత సైతం స్పందిస్తూ.. ‘సాధారణ జనం మాట్లాడతారు. అదే తెలివైనవారు వాటిని గ్రహిస్తారు.. కానీ కుక్కలు మాత్రమే మొరుగుతాయి.. ఈ పోస్ట్ ఎందుకు పెట్టానో మీకు అర్థమైందని అనుకుంటున్నా’ అంటూ ఘాటుగానే స్పందించింది మాధవీలత. ఇక శ్రీరెడ్డి ఊరుకుంటుందా.. పైగా తనను కుక్కతో పోల్చడంతో తన నోటికి పనిచెప్పంది. ఇన్ డైరెక్ట్‌గా చి***కుక్కతో పోల్చుతూ.. కుక్క అంత హైట్ ఉన్న వాళ్లు కూడా ఏనుగు మీద జోకులేస్తుంటే.. దేనితో నవ్వాలో అర్థం కావట్లే. చిత్తకార్తె **** అంటూ బీప్ వేయాల్సిన భాషలో బూతులు మొదలుపెట్టింది శ్రీరెడ్డి. మొత్తానికి వీరిద్దరి మధ్య మల్లెపూల వివాదం గట్టిగానే నలుగుతోంది. Read Also:


By April 25, 2020 at 11:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mallepulu-controversy-actress-sri-reddy-vulgar-post-on-madhavi-latha/articleshow/75370482.cms

No comments