భర్తను కొబ్బరిమట్టతో కొట్టి చంపిన భార్య.. షాకింగ్ కారణం

దంపతుల మధ్య తలెత్తిన ఘర్షణలో భర్త దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటకలోని జిల్లాలోని హొసదుర్గం తాలూకా బళ్లాలసముద్రం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బళ్లాలసముద్రం గ్రామంలో నివాసం ఉంటున్న జయచంద్రనాయుడు (55), రుక్మిణి భార్యాభర్తలు. మనస్పర్థల కారణంగా వీరిద్దరు కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. పక్కపక్కన ఇళ్లల్లోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పొలం, గొట్టపు బావి నీటిని పంచుకునే విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: బుధవారం రుక్మిణి తన పొలంలోని చెత్తకు నిప్పంటించగా మంటలు పక్కనే ఉన్న జయచంద్రనాయుడు పొలం గట్టున ఉన్న ఎండుగడ్డికి వ్యాపించాయి. దీంతో గొట్టపు బావికి అమర్చిన విద్యుత్తు కేబుల్ కాలిపోయింది. సాయంత్రం పొలం వద్దకు వచ్చిన జయచంద్రనాయుడు కాలిపోయిన తీగలను చూసి అక్కడ ఉన్న రుక్మిణితో ఘర్షణ పడ్డాడు. దీంతో ఆమె కోపంతో కొబ్బరి చెట్టు ఆకుమట్టతో భర్త తలపై కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కూలీలు వెంటనే జగళూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై శ్రీరాంపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By April 03, 2020 at 12:24PM
No comments