వైద్యుల భద్రతపై కేంద్ర ఆర్దినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
దేశ వ్యాప్తంగో విజృంభిస్తున్న వేళ కేంద్రం తెచ్చిన కొత్త ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. కరోనా కోసం నిరంతరం పనిచేస్తున్న వేళ డాక్టర్లపై జరుగుతున్న దాడులతో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌తో ఇకపై వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే జైలుకే వెళ్లాల్సి ఉంటుంది. ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో అనేకమంది డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్నారు. అయితే పలు చోట్ల వైద్యులు, జరుగుతున్నాయి. దీంతో ఈ దాడులపై కేంద్రం సీరియస్ అయ్యింది. వైద్య సిబ్బంది రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యులపై దాడులను నిరోధించేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. 1897 నాటి ఎపిడెమిక్ డిసీజెస్ చట్టంలో మార్పులు చేసి తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్లు అయ్యింది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఈ ఆర్డినెన్స్ అమల్లో ఉండనుంది.
By April 23, 2020 at 09:21AM
No comments