Breaking News

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: గుబులు పుట్టిస్తున్న నిజాముద్దీన్ ఘటన.. వందలాది మందికి వైరస్?


⍟ మహమ్మారి క్రమంగా కోరలు చాస్తోంది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలు రేపిన ప్రకంపనలు దేశమంతటా వ్యాపించాయి. నిజాముద్దీన్ మర్కజ్ పరిణామాలతో ఒక్కసారిగా దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడమే కాదు.. అన్ని శాఖలను కుదిపేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మర్కజ్ ఘటనతో ఉలిక్కి పడుతున్నారు. తెలంగాణలో సోమవారం వెలుగుచూసిన తర్వాత కేంద్రం మరింత అప్రమత్తమయ్యింది. ⍟ ప్రపంచవ్యాప్తంగా ఉద్ధృతి సాగుతోంది. ఈ మహమ్మారి ప్రస్తుతం 200 దేశాలకు విస్తరించి, వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. చైనాలో గతేడాది డిసెంబరులో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచాన్ని జలగలా పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ పాదం మోపని దేశమే లేదంటే తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని సగం కంటే ఎక్కువ దేశాలు లాక్‌డౌన్‌లోనే కొనసాగుతున్నాయి. ⍟ ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్యం హాఫ్ సెంచరీ దాటేసింది. వీరిలో ఎక్కువమంది సమావేశాలకు వచ్చిన వాళ్లు ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లిన వారిలో 28 మందిని గుర్తించారు.. వీరిని , పీలేరు, పుంగనూరు, చిత్తూరు, కురబలకోట, పద్మావతి నిలయంలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తీసుకెళ్లారు. ⍟ పొట్టకూటి కోసం వచ్చిన పొరుగు రాష్ట్రాల వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోంది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలకు లాక్‌డౌన్ వేళ ఉచితంగా బియ్యం పంపిణీ చేయడంతో పాటు రూ.500 చొప్పున డబ్బులు పంపిణీ చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేషన్ కార్డు లేకున్నా.. అధికారులు వారికి బియ్యం, గోధుమలు అందజేస్తున్నారు. ⍟ ఇవాళ ఏప్రిల్ 1వ తేదీ. సాధారణంగా అయితే ఈరోజున చాలామంది తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఫూల్స్ చేస్తూ ఉంటారు. లేని వాటిని చెప్పి ఉందని నమ్మించి ... తీరా నమ్మాక నువ్వు అయ్యావురా అంటూ జోక్ చేస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం అలాంటి జోక్స్‌కు బ్రేకులు పడ్డాయి. మామూలుగా అయితే ఏప్రిల్ ఫూల్ చేసుకోవచ్చు కానీ... కరోనా వైరస్‌ పేరుతో ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తే మాత్రం చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు అధికారులు. ⍟ ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది.అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ మహమ్మారి దెబ్బకు వణికిపోతోంది. ఎన్‌ఆర్‌ఐలు, తెలుగువారు కూడా చాలామంది అమెరికాలో చిక్కుకుపోయారు. కొంతమంది విద్యార్థులది అదే పరిస్థితి. దీంతో తెలుగువారిలో భరోసా నింపేందుకు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు కొందరు ఎన్‌ఆర్‌ఐలు. ⍟ ఏపీలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి వరకు 44 కేసులు నమోదుకాగా.. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మరో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ నివేదికను ఆ జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు వాట్సాప్‌ ద్వారా తెలిపారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా సోకిన బాధితుల సంఖ్య 58కి చేరినట్లైంది.


By April 01, 2020 at 09:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-news-updates-in-andhra-and-telangana-across-india-and-globally-in-telugu/articleshow/74923832.cms

No comments