భార్యను చంపి భర్త ఆత్మహత్య... విషాదాంతమైన వృద్ధ దంపతుల జీవిత ప్రయాణం
నల్లజర్లలో దారుణ ఘటన జరిగింది. మనస్పర్థలు, ఆర్థిక పరమైన గొడవల కారణంగా ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను హత్యచేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలం ఆవపాడులో గురువారం ఈ ఘటన జరిగింది. ఆవపాడుకు చెందిన పసుపులేటి రంగారావు (60), కళావతి (58) భార్యాభర్తలు. కొన్నాళ్ల పాటు వీరిద్దరూ విజయవాడలో హోల్‌సేల్ కిరాణా వ్యాపారం చేశారు. అందులో నష్టాలు రావడంతో నాలుగు నెలల కిందట స్వగ్రామానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆస్తికి సంబంధించి దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వారిద్దరూ చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. Also Read: రంగారావు తమ్ముడి ఫిర్యాదు మేరకు తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్, ఎస్సై చంద్రశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బుధవారం రాత్రి మంచంపై పడుకొని ఉన్న కళావతి మెడపై రంగారావు కత్తితో హత్య చేసి, ఆపై ఆయన పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అంచనాకు వచ్చారు. Also Read: నాలుగేళ్ల కిందట రంగారావు కుమారుడు దుర్గాప్రసాద్‌కు ఓ యువతితో వివాహమైంది. పెళ్లయిన మూడు నెలలకే వారి మధ్య గొడవలు వచ్చాయని, దీంతో ఆ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నట్లు పోలీసులకు విచారణలో తేలింది. మంట్లో కాలిపోతున్న ఆమె భర్తను గట్టిగా పట్టుకోవడంతో దుర్గాప్రసాద్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం రంగారావు దంపతులు కూడా అదే విధంగా చనిపోవడంతో ఆవపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం రంగారావు కుమార్తె కృష్ణకుమారి ఛత్తీస్‌గఢ్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడి దగ్గర ఉంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు చివరిచూపునకు దూరమయ్యారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read:
By April 17, 2020 at 09:10AM
No comments