కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: గంటకు 107 మంది కరోనాకు బలి
⍟ అమెరికాలో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ ఏకంగా 4,491 మంది ఈ వైరస్ మహమ్మారికి బలయ్యారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 34,562కి చేరింది. వైరస్ మొదలైన నాటి నుంచి ఇంతమంది ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. అయితే, గురువారం వెల్లడించిన మృతుల సంఖ్యలో కరోనా అనుమానిత మరణాలను కూడా కలిపి లెక్కించడం గమనార్హం. ⍟ కరోనా మహమ్మారికి కారణంగా ప్రపంచంలో గంటకు సగటున 107 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలో మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో మరో 2,569 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 33 వేలు దాటింది. వైరస్ బాధితుల సంఖ్య 6.77 లక్షలకు చేరింది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా వైరస్ బాధితుల్లో 5.47 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ⍟ దేశంలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే మిగతా దేశాల్లో మాదిరిగా పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం రావడంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ⍟ దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య బుధవారం కాస్త తగ్గినా.. గురువారం భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,260 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మరో 26 మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లో రికార్డుస్థాయిలో ఒక్క రోజే 361 కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఒకే రాష్ట్రంలో కేసులు నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. . ⍟ కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న ప్రపంచ దేశాలకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను సరఫరా చేస్తోంది. యాంటీ మలేరియా డ్రగ్ అయిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ⍟ కరోనా వైరస్ దెబ్బకు అమెరికా అల్లాడిపోతోంది. మిగతా ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో 6.7 లక్షల నమోదు కాగా.. దాదాపు 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ ఐదు లక్షల కరోనా కేసులు నమోదు కావడంతోపాటు దాదాపు 11,500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ⍟ ప్రమాదకరమైన కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి. ఇంట్లోనే ఉండటంతోపాటు ప్రతి ఒక్కరితో నియమిత దూరంలో ఉండాల్సిన అవసరముంది. అయితే కర్ణాటకలోని ఒక కుటుంబం సోషల్ డిస్టెన్స్ కోసం ఏకంగా అడవుల్లోకి వెళ్లడం షాక్‌కు గురిచేస్తోంది. ⍟ ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 40 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారు. మార్చి నెలలో నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన కుటుంబ సభ్యుల ద్వారా వీరికి కరోనా సోకింది. 40 మంది పిల్లలతోపాటు తబ్లీగీకి వెళ్లొచ్చిన వారి ద్వారా 124 మంది మహిళకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ⍟ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. గురువారం కొత్తగా మరో 9 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలియజేశారు. వీటిలో కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఈ 9 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు పెరిగింది. ⍟ తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు జరుగుతుందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై ఈ మధ్య పలు చోట్ల దాడులు జరిగాయని.. ఎవరైనా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ⍟ ఢిల్లీ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఆరు అంతస్థుల ఓ భవనంలో.. మార్చి నెలలో మత సంబంధ ప్రార్థనలు నిర్వహించారు.
By April 17, 2020 at 09:23AM
No comments