Breaking News

పరాయి మహిళతో రాసలీలలు... కేసుల భయంతో వ్యక్తి ఆత్మహత్య


సంబంధం చిచ్చు రేపింది. భార్యభర్తలు, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న సంసారంలో ఇంటి యజమాని పక్కచూపులు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. పరాయి మహిళతో వెలుగుచూడటంతో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అతడి భార్, కొడుకు, కుమార్తె దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలులో జరిగింది. Also Read: కొమరోలు మండల కేంద్రానికి చెందిన దూదేకుల మస్తాన్‌(36)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడు కొంతకాలంగా కంభం ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబ సభ్యులు మస్తాన్‌ను హెచ్చరించినా అతడు పట్టించుకోకుండా ప్రియురాలి ఇంటికి వస్తూ పోతున్నాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని మస్తాన్‌ కొద్దిరోజులుగా భయాందోళనలకు గురవుతున్నాడు. Also Read: ఈ క్రమంలోనే అతడు శుక్రవారం గిద్దలూరు వచ్చి పురుగుల మందు తాగేశాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మస్తాన్‌ను గిద్దలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారడంతో అంబులెన్స్‌లో తరలిస్తుండగా చీమకుర్తి సమీపంలో ప్రాణాలు విడిచాడు. మస్తాన్‌ భార్య ఖాసీంబీ ఫిర్యాదు మేరకు గిద్దలూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మృతదేహానికి గిద్దలూరులో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మస్తాన్, ప్రియురాలిని, ఆమె బంధువులును విచారిస్తున్నట్లు సమాచారం. Also Read:


By April 26, 2020 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/prakasam-district-man-commits-suicide-over-illegal-affair-with-another-woman/articleshow/75385290.cms

No comments