Breaking News

కన్నతల్లినే చంపేసిన కిరాతకుడు.. కర్నూలు జిల్లాలో దారుణం


ఆదోని పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్బీఐ కాలనీలో ఎస్‌.గంగాబాయి (63) అనే మహిళను ఆమె కుమారుడు శనివారం రాత్రి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం... కాలనీకి చెందిన గంగాబాయి, శివశంకరరావు దంపతులకు ఇద్దరు కుమారులు. పన్నెండేళ్ల క్రితం శివశంకరరావు మృతి చెందారు. గంగాబాయి పెద్దకుమారుడు ఎంసీఏ చదివి స్థానికంగా ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఐదు నెలలుగా అతడి మానసికస్థితి అదుపు తప్పింది. కుటుంసభ్యులు, స్థానికులతో కారణంగా లేకుండానే గొడవ పడటం, ఇష్టారీతిన వ్యవహరించేవాడు. Also Read: ఈ క్రమంలోనే శనివారం రాత్రి తల్లితో గొడవపడిన యువకుడు వ్యాయామానికి వినియోగించే డంబుల్స్‌తో ఆమె తలపై కొట్టాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునే సరికే గంగాబాయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ పార్థసారథి, ఎస్సైలు రాజా కుళ్లాయప్ప, రామాంజులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By April 26, 2020 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-killed-by-her-son-in-adoni-town-kurnool-district/articleshow/75385601.cms

No comments