Breaking News

పవన్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేసిన క్రిష్.. భలే ఐడియాలే!! ఇక రచ్చ రచ్చే..


అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాస్త వినూత్నంగా ఆలోచించి ‘బీ ది రియల్ మెన్’ ఛాలెంజ్‌లోకి సెలబ్రెటీలందరినీ లాగిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ సమయంలో ఇంటి పట్టునే ఉంటున్నాం కాబట్టి ఇంటి పనుల విషయంలో ఇంట్లోని ఆడవాళ్లకు సహాయపడిన వాడే రియల్ మెన్ అంటూ ఈ ఛాలెంజ్ బయటకు వదిలారు సందీప్. దీనికి టాలీవుడ్ ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభించింది. రాజమౌళి మొదలుకొని రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, వెంకటేష్, సుకుమార్, చిరంజీవి వరకు అందరూ ఇందులో భాగమయ్యారు. అయితే ఇప్పుడు ఇదే ఛాలెంజ్ విషయమై ఇంకాస్త వినూత్న ఆలోచన చేసిన డైరెక్టర్ .. దీన్ని సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. సంగీత దర్శకులు కీరవాణి విసిరిన ఛాలెంజ్‌ను పూర్తి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్రిష్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేశారు. అందరిలా వేరే సెలబ్రిటినీ నామినేట్ చేయకుండా ఏకంగా పవన్ ఫ్యాన్స్ అందరికీ సవాల్ చేశారు. ‘‘కీరవాణి ఇచ్చిన సవాల్ పూర్తి చేశాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్వీకరించాలని కోరతున్నా. ఈ ఛాలెంజ్ ద్వారా ఇంటి పనులు చేసి తమ ఇళ్లలోని ఆడవారికి సాయపడాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు క్రిష్. క్రిష్ చేసిన ఈ ఛాలెంజ్ పట్ల పవన్ ఫ్యాన్స్ పెద్దఎత్తున రియాక్ట్ అవుతూ రిప్లైలు పెడుతున్నారు. ‘‘సర్.. ఇంతవరకూ ఎవరూ ఇలా ఫ్యాన్స్‌ను నామినేట్ చేయలేదు. మీరే చేశారు. ఇక మా పవర్ ఏంటో చూపిస్తాం’’ అంటూ క్రిష్ ట్వీట్‌పై కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. చూస్తుంటే.. సెలబ్రిటీలకు ఆదర్శంగా తీసుకొని 'బీ ది రియల్ మెన్' అంటూ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదేమో అనిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడంతోనే డైరెక్టర్ క్రిష్‌తో సినిమా చేస్తున్నారు. తన 'వకీల్ సాబ్' సినిమా పూర్తిచేస్తూనే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో భాగమవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ఏదేమైనా తన సినిమాను ప్రమోట్ చేసుకునే వే ఆలోచించి పవన్ ఫ్యాన్స్‌ని ‘బీ ది రియల్ మెన్’ ఛాలెంజ్‌లో ఇన్వాల్వ్ చేయడం క్రిష్‌ టాలెంట్‌కి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.


By April 24, 2020 at 08:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/be-the-real-man-director-krish-targets-pawan-kalyan-fans/articleshow/75339431.cms

No comments