Breaking News

నాలుగేళ్ల బాలికపై తాత అఘాయిత్యం... విశాఖ మన్యంలో దారుణం


విశాఖ మన్యంలో దారుణ ఘటన జరిగింది. 60 ఏళ్ల వృద్ధుడు మనవరాలి వరుసయ్యే అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ గొందివలసకి చెందిన గెడ్డంగి కొండబాబు (60) ఇంటి పక్కనే ఉండే బాలిక(4)ను మిఠాయి కొనిస్తానని నమ్మించి శుక్రవారం బయటకు తీసుకెళ్లాడు. ఇంటి వెనుకాలే ఉండే చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతున్న తల్లికి బాలిక ఏడుపు వినిపించింది. దీంతో ఆమె అటువైపునకు వెళ్లి చూడగా రక్తస్రావంతో కూతురు కనిపించింది. విషయం అర్ధం చేసుకున్న తల్లి ఆగ్రహంతో వృద్ధుడిని చితకబాది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో హుకుంపేట ఎస్సై అప్పలనాయుడు, ఎంపీడీఓ ఇమ్మానుయేలు గొందివలస చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బాలికకు తాత వరుసవుతాడని కుటుంబసభ్యులు తెలిపారు. Also Read:


By April 04, 2020 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/4-yr-old-girl-raped-by-grand-father-in-vizag-district/articleshow/74977167.cms

No comments