Breaking News

హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్.. మైనర్ బాలికపై నలుగురు కామాంధులు పశువుల్లా


కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. దీనిలో భాగంగానే పోలీసులు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. భాగ్యనగరంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాగాజా దుండిగల్ పీఎస్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో మతిస్థిమితం సరిగ్గాలే లేని బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: కుత్బుల్లాపూర్‌‌లోని ఓ ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక(14) ఈ నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. రోడా మేస్త్రీనగర్‌లో బుధవారం నడుకుచుంటూ వెళ్తున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన అక్బర్‌, జుమన్‌, గయాజ్‌, అలీం అనే యువకులు సమీపంలోని ఓ పాడుపడిన భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బాలిక నిందితులకు తెలియకుండా వారి ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. Also Read: దీంతో వారు వెంటనే దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా రెండు గంటల తర్వాత బాధితురాలు దేవేందర్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించి రక్షించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తిని పట్టుకోగా మిగిలిన ముగ్గురు పరారయ్యారు. కాసేపటికే పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. Also Read:


By April 24, 2020 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/14-yr-old-girl-gang-raped-by-4-men-in-hyderabad-3-arrested/articleshow/75340014.cms

No comments