Breaking News

మీరు దొంగ పనిచేశారు.. మీ వల్లే పవన్ కళ్యాణ్! పూరిపై రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్


పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్.. నిజ జీవితంలో ఒక్కటై కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం విడివిడిగా ఉంటున్న ఈ జోడీ అంటే జనాల్లో ఇప్పటికీ అదో క్రేజ్. పవన్ కనిపించగానే రేణు, రేణు కనిపించగానే పవన్ గుర్తొస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్- జోడీ విడిపోవడం ఎంతో మంది ఫ్యాన్స్‌ని నిరాశ పర్చింది. అయినప్పటికీ ఆ చేదు నిజాన్ని గుండెలో దాచుకున్న ఫ్యాన్స్‌ని 'బద్రి' మూవీ 20 ఇయర్స్ పూర్తిచేసుకోవడం మరోసారి పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. అంతేకాదు రేణుదేశాయ్ కూడా తన జీవితాన్ని మార్చేసింది 'బద్రి' సినిమానే అంటోంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్, అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా 'బద్రి' సినిమా రిలీజై సంచలనాలు సృష్టించింది. డైరెక్టర్ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి ఈ 20 సంవత్సరాల్లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరుగా ఎదిగారు. డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కాసేపు వీడియో చాట్ చేసిన రేణుదేశాయ్.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన లైఫ్ ఇలా ఉండటానికి కారణం మీరే అని పూరితో చెప్పింది. పూరి జగన్నాథ్ ఓ బ్రిలియంట్ రైటర్ అంటూ ఆయన్ను తెగ పొగిడింది రేణు దేశాయ్. ''ఎలాంటి ఆడిషన్స్ తీసుకోకుండా నన్ను నమ్మి వెన్నెల రూపంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా తొలి సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్నా. కాకపోతే ఆ సినిమాలో అదే మెయిన్ రోల్ అని చెప్పి దొంగ పని చేశారు. అయితే మీరు బద్రి సినిమాలో ఆ రోల్ రాశారు, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టే కళ్యాణ్ గారిని కలిశాను. ప్రపంచంలోనే ఎంతో విలువైన ఇద్దరు పిల్లలకు తల్లయ్యాను. ఇదంతా మీరు సృష్టించిన ఆ క్యారెక్టర్ వల్లే జరిగింది. అందుకే నా జీవితంలో మీరు చాలా చాలా స్పెషల్ పర్సన్'' అని చెప్పింది రేణుదేశాయ్. అబ్బాయ్ అకీరా ఫోటో చూశాను.. చాలా బాగున్నాడు. సో.. టాల్ అని పూరి జగన్నాథ్ అనగానే 6.4 జగన్ గారూ అంటూ అకీరా హైట్ చెప్పింది రేణు. అకీరాను ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తావని చాలా మంది అడుగుతున్నారని, కానీ అతను మాత్రం నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు మమ్మీ అంటున్నాడని చెప్పింది. అతని ఇష్టం.. ఇష్టముంటే చేస్తాడు. లేదంటే లేదు అని రేణు చెప్పుకొచ్చింది.


By April 21, 2020 at 08:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/renu-desai-shocking-comments-on-puri-jagannadh/articleshow/75263578.cms

No comments