Breaking News

కరోనా సోకిందన్న భయంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య


కరోనా భయంతో ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ బిటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తనకు కరోనా సోకిందన్న భయంతో బీటెక్ చదువుతున్న విద్యార్థిని సూసైడ్‌కు పాల్పడింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో చోటు చేసకుంది. దాసరి బాలయ్య, లక్ష్మీ దంపతులు కుమార్తె స్రవంతి. సిద్ధిపేట జిల్లా ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతోంది. స్రవంతి తండ్రి గల్ఫ్‌లో పనిచేస్తుండగా ... తల్లి వ్యవసాయ పనులకు వెళ్తుంది. స్రవంతి సోదరుడు హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఇంట్లో ఇంటరిగా ఉన్న స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ప్రాణాలు తీసుకుంది. అయితే స్రవంతి చనిపోయే ముందు ఓ సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ‘నాకు కరోనా లక్షణాలు ఉన్నాయి. కాలేజీకి వెళ్తున్న సమయంలో బస్సులో నా పక్కన కూర్చున్న వారి నుంచి ఈ వ్యాధి సోకి ఉంటుంది. దాన్ని నా కుటుంబసభ్యులకు అంటించకూడదనుకుంటున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. అమ్మను బాగా చూసుకోవాలి’ అని స్రవంతి సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. అయితే స్రవంతి తల్లి మాత్రం తన కూతురుకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెబుతోంది. దీంతో ఇప్పుడు స్రవంతి ఆత్మహత్య ఓ మిస్టరీలా మారింది.


By April 01, 2020 at 12:07PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/btech-student-kills-herself-after-becoming-convinced-she-was-infected-with-coronavirus/articleshow/74925955.cms

No comments