దోశ వేసిన చిరంజీవి... అమ్మకు ప్రేమతో టిఫిన్ అందించిన మెగాస్టార్
బి ది రియల్ మేన్ ఛాలెంజ్ చేసి చూపించారు. ఎన్టీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన చిరంజీవి ఇవాళ ఇంటి పనులు చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాక్యూమ్ క్లీనర్‌తొ ఇళ్లంతా క్లీన్ చేశారు మెగాస్టార్. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి స్వయంగా టిఫిన తయారు చేశారు. పొయ్యిపై పెనం పెట్టి గుండ్రంగా దోశ వేశారు. ఆ తర్వాత ఆ దోశను తీసుకెళ్లి తన తల్లి అంజనా దేవికి అందించారు. అయితే కొడుకు తీసుకొచ్చిన టిఫిన్‌ను చూసి మురిసిపోయిన తల్లి... మొదటి ముద్ద కొడుకుకే తినిపంచారు. అనంతరం ఆమె కూడా తిన్నారు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తల్లితో ముచ్చట్లు చెబుతూ నవ్వుతూ ఉన్న వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. భీమ్ రాజ్ ఛాలెంజ్ స్వీకరించిన నేను ఈ రోజు చేసే పనులే... ఇవాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ చిరు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆ ఛాలెంజ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్, రజనీకాంత్‌కు సవాల్ చేశారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా సరికొత్త ఛాలెంజ్‌ను టాలీవుడ్‌లో ప్రారంభించారు. దర్శకుడు సందీప్ రెడ్డి ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ఇంటి పనులు చేసి... ఆ ఛాలెంజ్‌ను దర్శక ధీరుడు రాజమౌళికి విసిరారు. దీంతో సవాల్ స్వీకరించిన రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్‌తో పాటు... మరికొంతమందికి కూడా బి ది రియల్ మేన్ ఛాలెంజ్ చేశారు. తారక్ ఇంటి పనులు చేస్తూ... మెగాస్టార్‌తో పాటు, బాబయ్ బాలకృష్ణ, వెంకటేష్, నాగర్జునలకు సవాల్ చేశాడు. అయితే చిరు వీడియో కోసం వెయిటింగ్ అంటూ వెంకీ నిన్న ట్వీట్ చేశారు. ఇప్పుడు చిరు వీడియో రావడంతో నెక్ట్స్ వచ్చేది వెంకటేష్ వీడియోను అంటూ తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద లాక్ డౌన్ వేళ ఇంటిలో లాక్ అయిన ఫ్యాన్స్ కోసం సినిమా హీరోలు మంచి వినోదాన్ని పంచుతున్నారు.
By April 23, 2020 at 09:41AM
No comments