Breaking News

BeTheRealMan: జక్కన్న సవాల్‌పై ఎన్టీఆర్ రియాక్షన్.. సీక్రెట్‌గా!!


లాక్‌డౌన్ నేపథ్యంలో సరికొత్త ఆలోచనలతో పలు ఛాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే 'సేఫ్ హాండ్స్ ఛాలెంజ్' పేరిట జనాల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న సెలబ్రిటీలు.. ఇప్పుడు 'బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్' స్వీకరిస్తూ, ఈ ఖాళీ సమయంలో తమ ధర్మపత్నికి సాయపడాలని చెబుతున్నారు. ఇంటి పనులు చేస్తూ భార్యకు సాయం చేసేవాడే రియల్ మ్యాన్ అంటూ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్ విసిరారు. ఈ మేరకు దర్శక ధీరుడు రాజమౌళికి సవాల్ చేశారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి.. చీపురు పట్టి ఇల్లు ఊడుస్తూ, డోర్స్ క్లీన్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, సంగీత దర్శకులు కీరవాణి, శోభు యార్లగడ్డకు 'బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్' విసిరారు. ఇది చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెంటనే రియాక్ట్ అవుతూ 'ఛాలెంజ్ సీకరిస్తున్నా జక్కన్న' అని రిప్లై ఇచ్చారు. అయితే తన బీ ది రియల్ మ్యాన్ వీడియో ఎప్పుడు షేర్ చేస్తాననే విషయం మాత్రం సీక్రెట్‌గా ఉంచారు ఎన్టీఆర్. Also Read: ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ RRR (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ ఘాటింగ్ వాయిదా పడింది. 2021 జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనేది జక్కన్న ప్లాన్.


By April 21, 2020 at 07:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ntr-responce-on-rajamouli-challenge/articleshow/75262854.cms

No comments