20YearsForPuriJagannadh: లవ్ యూ నిధి.. నిన్ను మిస్ అవుతున్నా అంటూ షాకింగ్ ట్వీట్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/75246335/photo-75246335.jpg)
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ విజయవంతంగా తన 20 సంవత్సరాల దర్శకత్వ జీవితాన్ని ఫినిష్ చేశారు. ఆయన మొదటి సినిమా 'బద్రి' సరిగ్గా 20 ఏళ్ల క్రిందట ఇదే రోజు (ఏప్రిల్ 20) విడుదలై పూరి కెరీర్‌కి బలమైన పునాది వేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసింది. దీంతో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో పూరి పేరు నానిపోయింది. ఆ తర్వాత సక్సెస్ జోష్ కొనసాగించిన ఆయన ఈ 20 ఏళ్ల సినీ కెరీర్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ, గోపిచంద్, రామ్ లాంటి హీరోలందరితో సినిమాలు చేసిన అనుభవం పూరి జగన్నాథ్ సొంతం. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ సొంతం చేసుకున్న ఆయన నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఛార్మితో కలిసి తన సినిమాలను తానే నిర్మించుకుంటున్న పూరి.. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. పూరి కెరీర్ ఇక క్లోజ్ అయినట్లే అనే దశలో 'ఇస్మార్ట్ శంకర్' అతన్ని తిరిగి ట్రాక్ ఎక్కించింది. ఇక ఈ సినిమాలో నటించిన రామ్, , నభా నటేష్‌లకు కూడా ఈ మూవీ మంచి లైఫ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పూరి 20 సంవత్సరాల కెరీర్ పూర్తిచేసిన సందర్భంగా ఆయనపై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్ చేసింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. ''మానవత్వం ఉన్న మనిషి.. లవ్ యూ సార్'' అని ఆమె పేర్కొంది. నిధి చేసిన ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన పూరి జగన్నాథ్.. ''నిధి లవ్ యూ.. నిన్ను మిస్ అవుతున్నా.. త్వరలోనే మళ్ళీ కలుద్దాం'' అంటూ బదులిచ్చారు. అంతా బాగానే ఉన్నా ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇలా లవ్ యూ అంటూ సంబోధించుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది. వీళ్ళ ట్వీట్ చూసిన నెటిజన్స్ ''పాపం బాగా ఆకలి మీద ఉన్నట్లున్నరు'' అంటూ సెటైరికల్ కామెంట్స్ పెడుతున్నారు.
By April 20, 2020 at 12:53PM
No comments