Breaking News

కరోనా వైరస్ అప్‌డేట్స్: కర్నూలులో 82కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి చైనాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశ హోదాను చైనా దాటేసినా ఇంకా ఆ పేరిట అనేక ప్రయోజనాలు పొందుతోందని ఆయన ఆరోపించారు. ఒకవేళ చైనాకు ఆ హోదా సరైనదే అయితే.. అమెరికాను కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే గుర్తించాలని వాదించారు. అమెరికాలోనూ అభివృద్ధి చేయాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. శ్వేతసౌధంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలోని వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. శనివారం ఉదయం మరో ఐదుగురికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 386కు చేరుకుంది. కొత్త కేసులు కర్నూలులోనే నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో మొత్తం కేసులు 82కు చేరాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కార్చిచ్చులా వ్యాపిస్తున్న కొవిడ్‌-19ను అలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటిన ప్రాంతాల్లో దాదాపు లక్షల సంఖ్యలో ప్రజలు మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస అంచనా వేసినట్టు పరిస్థితులు ఏమాత్రం భిన్నంగా లేవు. రోజు రోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, పాజిటివ్ కేసులు పెరుగుదల మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా రోజూ సగటున 650కిపైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 900కిపైగా కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలుచేయడం వల్లే వైరస్ వ్యాప్తి మందగించిందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఊహకు అందని రీతిలో వేగంగా పెరుగుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 10) రాత్రి నాటికి కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. కరోనా వల్ల అత్యధికంగా యూరప్‌లో ప్రాణ నష్టం సంభవిస్తోంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 896 మంది కరోనా బారిన పడగా.. 37 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదవడం మన దేశంలో ఇప్పటి వరకూ ఇదే తొలిసారి దేశంలో లాక్ డౌన్‌ను ఒకేసారి పూర్తిగా తొలగించి.. జనాలను రోడ్లపై వచ్చేలా చేయడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ 19కు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై బెన్నెట్ యూనివర్సిటీ గురువారం గ్లోబల్ కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా నారాయణ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ దేవిశెట్టి మాట్లాడుతూ.. దేశంలో లాక్ డౌన్ తొలగించిన తర్వాత కూడా సామాజిక దూరం పాటించాల్సి ఉంటుందన్నారు. కరోనా లక్షణాలతో నేపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు హైదరాబాద్‌లో నడి రోడ్డుపై ప్రాణాలు వదిలాడు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న బహదూర్ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ పేషెంట్లు ఎక్కువగా ఉండటం, బెడ్లు ఖాళీ లేకపోవడంతో.. అతడ్ని కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లమని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో అతడు కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లగా.. కరోనా లక్షణాలు ఉన్నాయని, హాస్పిటల్‌లో చేర్చుకోలేమని స్పష్టం చేశారు . తెలంగాణలో శుక్రవారం ఒకే రోజులో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందగా.. 45 మంది కోలుకున్నట్టు ప్రకటనలో వెల్లడించింది. ఏపీలో కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య గుంటూరులో ఏడు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో రెండు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ (కోవిడ్ 19) నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా గుర్తించినట్లు వెల్లడించింది.


By April 11, 2020 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-and-deaths-news-updates-in-andhra-and-telangana-across-india-in-telugu/articleshow/75090825.cms

No comments