Breaking News

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ ముగుస్తుందా? దేశవ్యాప్తంగా ఇదే చర్చ


మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన 10 మందికి కరోనా సోకడంతో అందులో పాల్గొన్నవారు, వారితో సన్నిహితంగా మెలిగిన 26 వేల మందిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచడం కలకలం రేగింది. మోరేనాకు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో వెయింటర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతడి తల్లి చనిపోవడంతో దుబాయ్ నుంచి మార్చి 17న మోరేనా నగరానికి వచ్చాడు. ఆమె మృతికి సంతాపంగా మార్చి 20న విందు ఏర్పాటుచేసి బంధు మిత్రులను పిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 205 దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారి ఇప్పటికే వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక అన్ని దేశాలూ సతమతవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ మహ్మమారి మరింత తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు అంతేస్థాయిలో ఉన్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. కరోనాపై పోరుకు ఆదివారం రాత్రి (ఏప్రిల్ 5) 9 గంటలకు విద్యుత్ దీపాలను ఆపి.. ఇంటి ముందు కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించిన సంకల్పం చేసుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపును దేశయావత్తూ ఆచరించింది. ఏపీని కరోనా పరేషాన్ వెంటాడుతోంది. కర్నూలులో ఏకంగా 53 పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనంరేపుతోంది.. ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాధితుల్లో ఓ రైల్వే ట్రాక్‌మెన్ కూడా ఉండటం కలకలంరేపుతోంది. అతడు ఎవరెవర్ని కలిశాడు.. ఎక్కడ తిరిగాడు అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అతడు గత నెలలో ఢిల్లీ నుంచి కర్నూలు వచ్చినట్లు గుర్తించారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకే రోజులో రాష్ట్రంలో 62 కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 332 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ రాత్రి పది గంటల సమయంలో హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 32 మంది పూర్తిగా కోలుకున్నట్లుగా అందులో పేర్కొన్నారు. సంగారెడ్డిలో కరోనా వైరస్ పాజిటివ్‌గా నమోదైన ఆరు కేసుల్లో.. రెండు రోజుల వ్యవధిలోనే మూడు కేసులు నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. జిల్లాలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వివరాలు గుర్తించిన అధికారులు వారందరినీ సంగారెడ్డి పట్టణంలోని ఎంఎన్‌ఆర్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆరుగురికి వైరస్ సోకినట్లు తేలింది. బాధితులను వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి వరకు 192గా ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా 60 కేసులు పెరిగి 252కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15 నుంచి ఆర్టీసీ ఆన్‌లైన్ రిజర్వేషన్లు మొదలయ్యాయి. ఈ నెల 14తో లాక్‌డౌన్‌ ముగిస్తుందని.. తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ రెడీ అయ్యింది. అందుకే ఆన్‌లైన్‌ రిజర్వేషన్లను ప్రారంభించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14తో ముగుస్తుందా.. మళ్లీ పొడిగిస్తారా? అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే తమ కార్యకలాపాలు పునరుద్దరణకు రైల్వే సహా వివిధ శాఖలు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14తో పూర్తవ్వాలి. 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. యూపీకి చెందిన ఎంపీలతో ఆయన ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ గురించి మాత్రమే యోగి ప్రస్తావించారా లేదా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ గురించా అన్న విషయంలో స్పష్టత లేదు.


By April 06, 2020 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-deaths-updates-in-andhra-and-telangana-across-india-and-globally-in-telugu/articleshow/75002325.cms

No comments