Breaking News

RRR సీతారామరాజు వచ్చేశాడు.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో


కోసం కొమరం భీం ఇచ్చిన సర్ ప్రైజ్ అదిరిపోయింది. రాజమౌళి(R) (R) ఎన్టీ రామారావు (R) ఈ ముగ్గురు మహామహుల కాంబినేషన్‌లో వస్తున్న RRR (రౌద్రం రుధిరం ర‌ణం) ఉగాది నాడు టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా.. నేను (మార్చి 26) రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ‘‘సోదర రామ్ చరణ్, మంచి పరిస్థితుల్లో నీ పుట్టినరోజును జరుపుకోవాలని నేను భావించాను. కానీ, ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఎందుకంటే, ఇంటిలో ఉండటమే ఇప్పుడు ముఖ్యం. రేపు ఉదయం 10 గంటలకు నీకొక డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము, ఇది నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప అనుభూతి అవుతుంది. రామరాజు కోసం భీమ్’’ అంటూ గురువారం నాడు ఎన్టీఆర్ పోస్ట్ పెట్టడంతో రామ్ కోసం భీమ్ ఇస్తున్న సర్ ప్రైజ్ గిఫ్ట్ కోసం కోట్ల మంది అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూశారు. ఇక రామ్ చరణ్ సైతం ‘‘వాహ్! నేను సరైన సమయంలో ట్విట్టర్‌లో చేరానని అనుకుంటున్నాను. లేదంటే నీ సర్‌ప్రైజ్ మిస్ అయ్యేవాడిని సోదర. రేపటి కోసం వేచిచూడలేక పోతున్నాను’ అని రిప్లై ఇవ్వడంతో రామ్ చరణే కాదు.. చాలా మంది ప్రేక్షకుల రామరాజు స్పెషల్ వీడియో కోసం ఎదురుచూశారు. కాగా ఈవీడియోను ముందుగా ప్రకటించిన సమయానికి విడుదల చేయలేకపోయారు రాజమౌళి. వాయిదా సంస్కృతి కొనసాగిస్తూ ఈ వీడియో కోసం 10 గంటల నుంచి ప్రేక్షకులు ఎదురు చూసేలా చేశారు. మోషన్ పోస్టర్‌లో రౌద్రంగా కనిపించిన రామ్ చరణ్ ఫేస్ ఫుల్‌గా రివీల్ కాలేకపోయినప్పటికీ ఈ వీడియోతో కొంత క్లారిటీ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, చ‌ర‌ణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు.


By March 27, 2020 at 10:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-birthday-special-rrr-alluri-sitarama-raju-video-goes-viral/articleshow/74840336.cms

No comments