Breaking News

Corona Crisis Charity: వరుణ్ తేజ్ 20లక్షలు, శర్వా 15, దిల్ రాజు 10 ఇంకా..


కరోనా కష్టానికి టాలీవుడ్ ఆపన్న హస్తం అందిస్తోంది. కరోనా వైరస్ విజృంభనతో షూటింగ్‌లు లేక సినిమాలు విడుదల కాక వేల మంది సినీ కార్మికులు, కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని చాలా మంది కార్మికులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి సాయం చేయడానికి టాలీవుడ్ స్టార్‌లు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి విరాళాలను ప్రకటిస్తూ వాళ్ల ఆకలి తీర్చుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా తమకు తోచిన సాయాన్ని చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ కరోనా క్రైసిస్ ఛారిటీకి మెగా ప్రిన్స్ రూ.20 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే శర్వానంద్ 15 లక్షలు, మాస్ కా దాస్ రూ. 5 లక్షలు, బడా ప్రొడ్యుసర్ దిల్ రాజు రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.


By March 29, 2020 at 11:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/varun-tej-20-laks-sharwanand-15-laks-and-viswak-sen-5-laks-donated-to-corona-crisis-charity/articleshow/74870940.cms

No comments