Breaking News

శభాష్ మమత.. బెంగాల్‌ సీఎంపై నెటిజన్ల ప్రశంసలు


దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. జనాలను ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని చెప్పినా వినడం లేదు. నిత్యావసరాలు, కూరగాయల పేరుతో బయటకు వస్తున్నారు. ఇంటికి ఒకరి చొప్పను రమ్మని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ గుంపులు, గుంపులుగా వస్తున్నారు. పోనీ వచ్చిన వాళ్లు సామాజిక దూరం పాటిస్తున్నారా అంటే అదీ లేదు. గుంపులుగా నిలబడి నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. అక్కడక్కడా పోలీసులు, అధికారులే రంగంలోకి దిగి.. సామాజిక దూరంగా పాటించేలా.. సర్కిల్స్ గీస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగారు. లాక్‌డౌన్ జరుగుతున్న తీరును ఆమె స్వయంగా పర్యవేక్షించారు. అధికారులతో కలిసి మార్కెట్లను పరిశీలించారు. ఓ మార్కెట్‌లో జనాలు సామాజిక దూరం పాటించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతనే చొరవ తీసుకున్నారు. సామాజిక దూరం పాటించేలా సర్కిల్స్‌‌ను ఆమె గీచారు. కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని కూరగాయల వ్యాపారులను హెచ్చరించారు. అంతేకాదు మార్కెట్‌లలో పర్యటించిన సమయంలో ఆమె స్వయంగా తన కారులోంచి మాస్క్‌లు తీసుకుని అందరికీ అందజేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా వ్యాపారులకు సూచనలు చేశారు. దీంతో మమతపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సీఎం స్థానంలో ఉన్నా ఆమె స్వయంగా ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకునేందుకు రోడ్లపైకి రావడం గ్రేట్ అంటున్నారు.


By March 28, 2020 at 01:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/netizens-praises-bengal-cm-mamata-banerjee-for-her-dedication-and-precautions-for-coronavirus-social-distance/articleshow/74859592.cms

No comments