Breaking News

మొదటి భార్య ఉండగానే రెండోపెళ్లి.. కానిస్టేబుల్‌పై కేసు


ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు నీచానికి పాల్పడ్డాడు. ఓ మహిళతో కాపురం చేస్తూనే మరో యువతిని మభ్యపెట్టి రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఇద్దరు భార్యలకు తెలియడంతో అడ్డంగా బుక్కయ్యాడు. జిల్లా పోలీసు శాఖలో ఏఆర్‌ విభాగంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ మొదటి భార్య ఉండగానే ఇటీవల మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని దాచి పెట్టి ఇద్దరితోనూ కాపురం చేస్తున్నాడు. Also Read: ఇటీవల ఈ విషయం ఇద్దరు భార్యలకు తెలియడంతో వారు వేర్వేరుగా జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ విచారణ నిమిత్తం కేసును బదిలీ చేశారు. కానిస్టేబుల్ రెండో వివాహం చేసుకున్న వీడియో, ఫోటోలు బయటికి రావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. విచారణలో రెండో నిజమని తేలితే అతడిపై కఠినచర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. Also Read:


By March 18, 2020 at 10:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kadapa-police-conistable-gets-second-marriage-two-wives-filed-complaint-against-him/articleshow/74684571.cms

No comments