Breaking News

రాంగ్‌కాల్‌తో పరిచయం, కిడ్నాప్ చేసి రెండ్రోజుల పాటు.. మంచిర్యాలలో యువతిపై రేప్


తెలంగాణలోని జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రాంగ్‌కాల్ ద్వారా యువతిని పరిచయం చేసుకున్న ఓ యువకుడు స్నేహితుల సాయంతో ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను రెండ్రోజుల పాటు బంధించగా బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని పోలీసులకు సమాచారమిచ్చింది. Also read: మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి సెల్‌ఫోన్‌కు గత నెల 2న రాంగ్ కాల్ వచ్చింది. అవతల మంచిర్యాలకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు ఆమెతో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే పదేపదే ఫోన్లు చేస్తూ విసిగించడంతో ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పగా అతడిని మందలించారు. ఫిబ్రవరి 25న యువతికి ఫోన్ చేసిన సాయికృష్ణ... నీతో మాట్లాడాలి. అంబేద్కర్ చౌరస్తాకు రా.. అని పిలవడంతో ఆమె వెళ్లింది. Also read: అప్పటి నుంచి ఆమె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికి చివరిక 27వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటుచేసి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారం విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంబేద్కర్ చౌరస్తాకు వచ్చిన యువతిని సాయికృష్ణ తన ఫ్రెండ్ శివకృష్ణతో కలిసి ఆటోలో కిడ్నాప్ చేసి రామకృష్ణాపూర్‌లోని మూతపడ్డ ఓ స్కూల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ క్యాటరింగ్ పనులు చేసే బీజోన్‌కు చెందిన రాచకట్ల శశికాంత్‌, ఓ బాలుడు కూడా వారితో జత కలిశారు. యువతి సెల్‌పోన్‌ను లాక్కొన్న శశికాంత్ అందులో ఉన్న సిమ్‌కార్డును తన సెల్‌ఫోన్‌లో వేసుకుని అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. Also read: బాధితురాలిని పాఠశాలలోనే రెండు రోజులు ఉంచిన తర్వాత 27న రాత్రి మంచిర్యాలలోని శివకృష్ణ చెల్లెలి ఇంటికి తీసుకువచ్చారు. బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకొని బంధువులకు సమాచారం ఇచ్చింది. అప్పటికే యువతి కోసం గాలిస్తున్న పోలీసులు బాధితురాలిని రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం ఆటోలో కరీంనగర్‌ వైపు వెళ్తుండగా అరెస్ట్‌ చేశారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఒకడైన బాలుడిని హైదరాబాద్‌లోని జువైనల్ హోమ్‌కు తరలించారు. Also read:


By March 04, 2020 at 11:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-raped-by-man-in-mancherial-district/articleshow/74470030.cms

No comments