సాయితేజ్ మరోటి స్టార్ట్ చేశాడు..అది కూడా ఫ్లాప్ డైరెక్టర్ తో..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. చిత్రలహరి సినిమా ముందు వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న సాయికి చిత్రలహరి విజయం ఒక రిలీఫ్ కలిగించింది. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో మనోడు వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రతిరోజూ పండగే సినిమా రిలీజ్ కి ముందే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాని స్టార్ట్ చేశాడు.
ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ చివరి దశకి వచ్చిందని సమాచారం. అయితే ప్రస్తతం సాయి ధరమ్ తేజ్ మరో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. దేవకట్టా దర్శకత్వంలో ఈ చిత్రం ఉండనుంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేధా పేతురాజ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ రోజు ముహూర్తం షాట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పవన్ క్లాప్ కొట్టడంతో ఈ సినిమా స్టార్ట్ అయింది.
అయితే దర్శకుడు దేవకట్టా కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్లు లేవు. వెన్నెల, ప్రస్థానం విమర్శకుల ప్రశంసలు గెలుచుకున్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇక ఆటోనగర్ సూర్య గురించైతే చెప్పాల్సిన పనే లేదు. మరి ఇన్ని ఫెయిల్యూర్ లు ఉన్న డైరెక్టర్ తో ఫెయిల్యూర్ లో నుండి ఇప్పుడే బయటపడ్డ సాయి సినిమా చేయడం కొంత ఆశ్చర్యంగా ఉన్నా దేవకట్టా చెప్పిన కథ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకున్నాడని అర్థం అవుతుంది.
By March 12, 2020 at 11:11PM
No comments