Breaking News

అమెరికలో మరింత పెరగనున్న మరణాలు... ట్రంప్ ఆందోళనకర వ్యాఖ్యలు


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభన రోజురోజుకు పెరుగుతుంది. మూడు రోజుల్లో మరణాలు రెట్టింపు అయ్యాయి. యూఎస్‌లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజు 23 శాతం కేసులు నమోదయ్యాయ. దీంతో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటింది. మ‌ర‌ణాల సంఖ్య కూడా మూడు రోజుల్లో భారీగా పెరిగిపోతుంది. గురువారం నాడు 1000గా ఉన్న మ‌ర‌ణాల సంఖ్య ఆదివారం ఉద‌యానికి 2,227కి చేరింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా వైర‌స్ బారిన ప‌డిన వారి సంఖ్య 1,23,750గా ఉంది. క‌రోనా విజృంభణ రోజురోజ‌కీ తీవ్ర రూపం దాల్చుతుండ‌డంతో అమెరికన్లు భ‌యం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు వారాల్లో అమెరికాలో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సామాజిక దూరం పాటించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈస్టర్‌ పర్వదినం నాటికి అంతా సర్దుకోవాలని తాను ఆశించానన్నారు. కానీ, పరిస్థితులు ఆ దిశగా సాగడం లేదని నిరాశ వ్యక్తం చేశారు. కొన్నిరోజుల క్రితం మాట్లాడుతూ ట్రంప్ మరికొన్ని వారాల్లో దేశంలో పరిస్థితులు యథాతథ స్థితికి చేరుకుంటాయన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ మాటలు వేరేలా ఉన్నాయి. ఆంక్షల్ని పెంచడం... మరణాలు రేటు భారీగా పెరుగుతుందని చెప్పడంతో ట్రంప్‌లో ఆందోళన కనిపిస్తుంది. అమెరికాలో పరిస్థితి తీవ్రంగా ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. మరోవైపు అమెరికాలో మరింత కట్టుదిట్టమైన నిబంధనలు తీసుకొచ్చారు. 15 రోజుల పాటు జనసంచారంపై ఆంక్షలు విధించారు. మరో నెలరోజుల పాటు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. అమెరికాలో లక్ష మందికిపైగా ప్రాణాలను కరోనా బలి తీసుకునే ముప్పుందని ఆ దేశ ఆరోగ్య శాఖ నిపుణుడు ఆంథోనీ ఫాసీ అంచనా వేశారు. ఈ వైరస్‌ బెడద ఇప్పుడిప్పుడే తొలగిపోయేలా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ దెబ్బకు మృత్యువాతపడే వారి సంఖ్య లక్ష నుంచి 2 లక్షల మధ్య ఉంటుందనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఆంక్షల్ని కొనసాగించాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు 1,42,226 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో 2,493 మంది మరణించారు. మరో 4,443 మంది కోలుకున్నారు.


By March 30, 2020 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/donald-trunp-says-peak-us-death-rate-likely-in-2-weeks-in-america/articleshow/74881998.cms

No comments