Breaking News

ట్రైన్‌లోనే మహిళా బాక్సర్‌‌‌ని రేప్ చేసి.. బాక్సింగ్ కోచ్ కీచకపర్వం


ఎన్ని కఠిన చట్టాలు చేసినా మహిళలపై నేరాలకు అడ్డుకట్టవేయలేకపోతున్నాయి. నిత్యం మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళా బాక్సర్‌పై బాక్సింగ్ కోచ్ పదే పదే అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగుచూసింది. బాక్సింగ్ పోటీలకని చెప్పి తీసుకెళ్తూ ట్రైన్‌లోనే రేప్ చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని సోనాపేట్ ప్రాంతానికి చెందిన సందీప్ మాలిక్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్. పలు ప్రైవేటు బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం సోనాపేట్ ప్రాంతంలో బాక్సింగ్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పి శిక్షణ ఇస్తున్నాడు. అతని వద్ద బాక్సింగ్ నేర్చుకుంటున్న ఓ యువతిపై కన్నేసిన కోచ్ నీచానికి దిగాడు. ఆమెను దారుణంగా రేప్ చేశాడు. బాక్సింగ్ పోటీలకు వెళ్తున్న సమయంలో ట్రైన్‌లోనే ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. Also Read: గత ఫిబ్రవరిలో కోల్‌కతాలో జరిగిన బాక్సింగ్ పోటీలకు సందీప్ తన శిష్యులందరినీ తీసుకెళ్లాడు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లోనే మహిళా బాక్సర్‌పై కోచ్ సందీప్ మాలిక్ అత్యాచారం చేశాడు. బాక్సింగ్ పోటీల కోసం కోల్‌కతాలో ఉన్నన్ని రోజులూ ఆమెపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. వచ్చిన వెంటనే బాధిత మహిళా బాక్సర్ పోలీసులను ఆశ్రయించింది. కోచ్ తనను రేప్ చేశాడని ఫిర్యాదు చేసింది. Read Also: అయితే బాధితురాలిపై ట్రైన్‌‌లో అత్యాచారం జరగడంతో ముందుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. ఆ తరువాత కేసును రైల్వే పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేశారు. యువతిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రేప్ జరిగినట్లు నిర్ధారణ అవడంతో నిందితుడిపై రేప్ కేసు కింద కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. మహిళా బాక్సర్‌పై అత్యాచారానికి పాల్పడినట్టు కోచ్ ఒప్పుకున్నట్లు సమాచారం. బాక్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని పలువురిని కూడా లైంగికంగా వేధించాడన్న ఆరోపణలున్నాయి. Also Read:


By March 18, 2020 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/19-year-old-woman-boxer-raped-by-coach-in-delhi/articleshow/74685398.cms

No comments